కోలివుడ్ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 సినిమా ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పిన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోనూ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా మెరిసారు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వై. రవి శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన వారందరూ ఒకే మాట చెబుతున్నారు. సినిమా అద్భుతంగా ఉంది. కచ్చితంగా పాన్ ఇండియన్ లెవెల్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందని నమ్మకం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారని.. ఇక హీరోయిన్ రుక్మిణి వసంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆమె కష్టం దగ్గర నుంచి చూశాం. కేవలం కాంతారాలోనే కాదు ఆమె ప్రస్తుతం మా ఎన్టీఆర్ అన్న సరసన కూడా నటిస్తుంది. అద్భుతమైన నటి ఆమె అంటూ వివరించాడు. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గురించి మాట్లాడుతూ.. మేము ప్రామిస్ చేసినట్లుగా సినిమాను అనుకున్న టైంకి రిలీజ్ చేస్తాం. కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో స్టార్ట్ అయిపోతుంది. సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయబోతున్నాం. ఇక సినిమాలో రుక్మిణి వసంత్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎన్టీఆర్ అన్న పర్ఫామెన్స్ కు మ్యాచ్ చేయడానికి చాలా కష్టపడింది. ఈ రెండు సినిమాల్లో ఆమె నటన కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఈ సినిమా డ్రాగన్ రన్నింగ్ టైటిల్ తో తెగ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. మరియు ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు రవి బసృర్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఇక ఎన్టీఆర్‌కు.. ప్రశాంత్ నీల్ మొదటి నుంచి అభిమాని. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను ప్రతి ఒక్క ఫ్యాన్ అనుకున్నా రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ట్రీట్మెంట్‌తో చూపించనున్నాడట. ఈ ప్రాజెక్టు కోసం కేవలం తారక్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటే కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయడంలో సందేహం లేదంటూ టాక్ నడుస్తుంది.