టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, బోయపాటి కాంబో నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు.. ఫుల్ ఆఫ్ మాస్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ సిద్ధమైపోతారు. వీళ్లిద్దరు సినిమా అంటే సాంగ్ నుంచి మొదలుకొని.. మాటలోనూ, యాక్షన్ లోను, హీరోయిజంలోనే.. ఇలా ప్రతి ఒక్క అంశం లోను మాస్ మోతమోగిపోతుంది. ఈ క్రమంలోనే అంచనాలు కూడా ఆకాశాన్నిఅంటుతాయి.
ఇక ప్రతిసారి ఆడియన్స్ సంచనాలను మించి పోయే రేంజ్‌లో సినిమాను తెరకెక్కించి బోయపాటి.. బాలయ్యకు బ్లాక్ బస్టర్ అందిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగో సినిమా అఖండ 2పై కూడా.. ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఇక సినిమాలో అది పిన్నిశెట్టి విలన్ పాత్రలో.. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా మెరవనున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోసి అచ్చంట, రామ్ అచ్చంటా సినిమాకు ప్రొడ్యూసర్‌లుగా.. ఎం. తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఇక ప్రజెంట్ ఈ సినిమా షూట్ హైదరాబాద్‌లో గ్రాండ్గా జరుగుతుంది. ఈ క్రమంలోనే.. సెట్‌లో 600 మంది డ్యాన్సర్లతో.. బాలకృష్ణ పై ఓ మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. బాను నృత్య డైరెక్షన్‌లో బాలకృష్ణ మాస్ మూమెంట్స్‌తో.. ధమన్ మ్యూజిక్‌తో ఈ సాంగ్ బ్లాస్టింగ్ లెవెల్‌లో రూపొందుతుందట. ఇక సాంగ్ థియేటర్‌లో చూసే ఆడియన్స్‌కు ఫుల్ ట్రీట్ ఖాయమని.. థియేటర్స్ దద్దరిలిపోవాల్సిందే అంటూ టాక్ నడుస్తుంది. బాలకృష్ణ ఇదివరకు ఎన్నడూ లేని రేంజ్‌లో ఫుల్ వైల్డ్ అవతార్ లో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ నెలాఖరు.. లేదా సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.