కొత్త లోక.. రూ. 30 కోట్ల బడ్జెట్‌లో రూ. 300 కోట్లు.. దుల్కర్ రియాక్షన్ ఇదే..!

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తాజాగా ప్రొడ్యూసర్గా మారి విఫ‌ర‌ర్ ప్రొడక్షన్ బ్యానర్ పై కొత్తలోక సినిమాను నిర్మించారు. కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో మెరిసిన ఈ ఫాంటసీ థ్రిల్లర్.. ఇప్పటికే వందకోట్ల క్లబ్లో చేరుకోవడం విశేషం. ఈ క్ర‌మంలోనే మూవీ యూనిట్ స‌క్స‌స్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

Dulquer Thanks Telugu Audience As Kotha Loka Collects ₹5 Crore

టాలీవుడ్ డైరెక్టర్ నాగ అశ్విన్, వెంకీ అట్లూరి అలాగే.. తెలుగులో సినిమాల డిస్ట్రిబ్యూట్ చేసిన నాగ వంశీ.. మిగతా టీమ్ అంతా ఈవెంట్ లో సందడి చేశారు. ఈవెంట్‌లో వెంకి అట్లూరి మాట్లాడుతూ సినిమా నేను చూశా.. నాకు చాలా నచ్చింది. టెక్నికల్ గా బ్రిలియంట్ సినిమా. రూ.30 కోట్లతో.. రూ.300 కోట్ల రేంజ్ సినిమాను తీశారని వివ‌రించాడు.ఇక ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ సినిమా గురించి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో సినిమాను రూపొందించమని అంతా అనుకుంటున్నారు.

Dulquer Salmaan Speech at Kotha Lokah Success Celebrations | Kalyani, Naslen | Dominic Arun

కింగ్ ఆఫ్ కోత, ఫ‌రకు లాంటి సినిమాలకు అయినా భారీ బ‌డ్జెట్‌ ఈ సినిమాకు కూడా పెట్టాం. మాకు అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. మేము పెట్టిన ఖర్చు తెరపై క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ ఆలోచనలు కలిసి మంచి అవుట్ ఫుట్ వచ్చింది. దాని విజ‌న్‌తోనే కొత్తలోక అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఇక కళ్యాణి నా సోదరులాంటిదే. గత జన్మలో మేము కవల్ ఏమో.. మా అలోచ‌న‌లు ఎకేలా ఉంటాయి. తను హీరోయిన్‌గా సెలెక్ట్ కాగానే పాత్ర కోసం కష్టపడడం మొదలుపెట్టింది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. మలయాళ యాక్టర్స్ అంతా చాలా బాగా నటించారని.. సినిమాలోని ప్రతిపాత్ర మంచి వినోదాన్ని పంచిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దుల్క‌ర్‌ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.