వార్ 2.. భారీ టార్గెట్ తో రంగంలోకి తారక్, హృతిక్..!

ఈ వారం రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ సాలిడ్ పాన్ ఇండియన్ సినిమాలలో వార్ 2 కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ సినిమా బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియన్స్‌ను పలకరించింది. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్.. స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమా.. తాజాగా ఓపెనింగ్స్ ను ప్రారంభించి.. భారీ బుకింగ్స్ ను నమోదు చేసుకుంటుంది.

ఈ క్రమంలోనే.. వార్ 2.. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ లెక్కలు నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. దాదాపు.. వార్ 2ను ఏకంగా రూ.300 కోట్లకు పైగా టార్గెట్‌తో థియేట్రిక‌ల్‌ రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. హిందీ, తెలుగు సహా ఓవర్సీస్ మార్కెట్‌లో.. ఇంకా తమిళ్లోను కలిపి మొత్తంగా రూ.300 కోట్ల టార్గెట్ ఉన్న ఈ మూవీ.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.75 కోట్ల వరకు థియేట్రికల్ టార్గెట్ నమోదు చేసుకుందట.

War 2 Andhra, Nizam Business: వార్ 2 ముందు భారీ టార్గెట్.. ఎన్ని కోట్లు  వస్తే ఎన్టీఆర్ మూవీ లాభాల్లోకి అంటే? | War 2 Andhra, Nizam Theatrical  Business: Jr NTR's Movie break Even Target Here ...

ఈ క్రమంలోనే సినిమా ఈ టార్గెట్ ను రీచ్ అవ్వడం చాలా సులభం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందీలో దాదాపు 1రూ.50 కోట్ల రేంజ్ లో వసూళ్లు వస్తాయని.. తెలుగులోను ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రమంలో అదే రేంజ్ లో కలెక్షన్లు రావచ్చంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వార్ నార్త్ మార్కెట్‌లో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయో.. ఇప్పుడు అదే టాక్ మళ్ళీ వచ్చిన చాలు. ఎన్టీఆర్ ఫ్యాక్టర్, హృతిక్ రోషన్ గ్రేస్ సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుంది అంటూ సమాచారం. సో.. పాన్ వరల్డ్ రేంజ్ లో వార్ 2 టార్గెట్ ను బ్లాస్ట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలవ‌డం చాలా ఈజీ అంటూ ఫ్యాన్స్ సైతం ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.