వార్‌ 2 ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వ‌చ్చిన‌ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. రిలీజ్ తర్వాత ఘోరమైన డిజాస్టర్ ను అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రమే కాదు.. హిందీలోను ఈ సినిమా ఆల్ టైం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పటివరకు స్పై యూనివర్స్ లో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కంటే అతి తక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన చెత్త రికార్డ్‌ కూడా వార్ 2కి దక్కింది. తెలుగులో అయితే థియేటర్ వసూళ్లు కూడా తిరిగిరాని పరిస్థితి. ఎన్టీఆర్ లాంటి ఓ స్టార్ హీరో సినిమాకు ఇలాంటి కలెక్షన్లు రావడం.. ఇటీవల కాలంలో ఇలాంటి డిజాస్టర్ కలెక్షన్ అందుకోవడం మొదటిసారి.

ఇక సినిమా రిలీజ్ అయిన కేవ‌లం వారం రోజుల్లో సినిమా కలెక్షన్లు ఆగిపోవడంతో.. ఏ రేంజ్ లో వసూలు వచ్చానే వివరాలు నెటింట వైరల్ గా మారుతున్నాయి. తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఆగిపోయినా.. హిందీ నుంచి మాత్రమే ఎంతో కొంత వ‌సూళ్లు అవుతూనే ఉన్నాయి. 6వ‌ రోజు.. ఇండియాలో ఉండే పివిఆర్ మల్టీప్లెక్స్ చైన్స్ లో టికెట్ రేట్లు పై భారీ ఆఫర్లు ఉండడంతో.. 5వ రోజు కంటే కాస్త ఎక్కువ కలెక్షన్లు దక్కించుకున్నా.. 7వ రోజు మళ్లీ 40% డ్రాప్ ను చెవి చూడక తప్పని పరిస్థితి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిసి ఈ సినిమా మొదటివారం రూ.37 కోట్ల షేర్ ద‌క్కించుకుంది.

వరల్డ్ వైడ్ ధియేట్రిక‌ల్‌ షేర్ దాదాపు రూ.42 కోట్ల వరకు తెలుగు వెర్షన్ షేర్ వసూలు ఉండగా.. మిగిలిన ప్రాంతాలు కర్ణాటకలో రూ.8 కోట్లు, తమిళనాడు + కేరళలో రూ.2.65 కోట్లు, హిందీ వర్షాల్లో రూ.69 కోట్లు, ఓవర్సీస్‌లో హిందీ ప్లస్ తెలుగు వర్షన్స్ కలిపి రూ.31 కోట్ల షేర్ కలక్షన్లు దక్కించుకున్నాయి. ఓవరాల్‌గా వార్ 2 మొదటి వారం రూ.300 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకోగా.. రూ.150 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ అందుకోవడానికి రూ.54 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉండగా.. హిందీ వర్షం కూడా కలుపుకొని రూ.160 కోట్ల షేర్ దక్కించుకోవలసి ఉంది. ఏదేమైనా వార్ 2 విషయంలో.. మ్యాజిక్ జరిగితే తప్ప ఈ రేంజ్‌ కలెక్షన్లు రావడం కష్టమే. కనీసం.. రూ.140 కోట్ల కలెక్షన్లు నష్టంతో నిర్మాతలు కంట‌తడి పెట్టాల్సిన పరిస్థితి.