టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సెలక్షన్ టెంపర్ నుంచి చూస్తూనే ఉన్నాం. వరుస విజయాలతో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్నాడు. చివరిగా తెరకెక్కిన దేవర సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆయన.. రాజమౌళితో సినిమా తర్వాత ఏ సినిమా చేసిన కచ్చితంగా ప్లాప్ అనే సెంటిమెంట్ సైతం బ్రేక్ చేసి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్పుడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. ఈ సినిమాలో తారక్ తో పాటు.. మరో హీరో హృతిక్ రోషన్ నటించిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్‌కు ఇది మొట్టమొదటి బాలీవుడ్ ఫిలిం కావడంతో ఈ సినిమా పై టాలీవుడ్ ఆడియన్స్ లోను ఆసక్తి నెలకుంది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై స్పైయాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ఆగష్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాను రిలీజ్ చేశారు. ఇక అది ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య షూట్ చేసిన సాంగ్ కావడంతో.. ఆడియన్స్‌లో అనౌన్స్మెంట్ అప్పటి నుంచే మంచి హైప్ నెలకొంది. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేసిన ఈ టీజర్ కేవలం 35 సెకన్ల రన్ టైమ్‌తో రిలీజ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
పూర్తి సాంగ్ చూడాలంటే థియేటర్స్‌లోకి రావాల్సిందే అంటూ మేకర్స్ చివర్లో క్లారిటీ ఇచ్చేశారు. ఈ 35 సెకండ్ల బీట్‌తోనే ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించిన టీం.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి. కాగా.. ఇప్పటివరకు వార్ 2 నుంచి రిలీజ్ అయిన `టీజర్, ట్రైలర్ ఇలా.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌ను హృతిక్ రోషన్ డామినేషన్ ఎక్కువగా ఉందనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే.. ఈసారి మాత్రం టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్ ప్రోమో సాంగ్‌లో రెచ్చిపోయారు. తన స్టైల్ మార్క్ స్టెప్పులతో అదరగొట్టాడు. హృతిక్ రోషన్‌ను డామినేట్ చేస్తూ తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈ సాంగ్ హిందీలో జనాబ్ ఆలీ పేరుతో రిలీజ్ కాగా.. తెలుగులో దునియా అంతా సలమ్ అనాలి అంటూ రిలీజై ఆకట్టుకుంది. తమిళ్‌లో కలాబా పేరుతో రిలీజ్ చేశారు. అన్నట్లు.. తాజాగా సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఈ ఈవెంట్‌లో తారక్, హృతిక్ రోషన్ కూడా సందడి చేయనున్నారట.