వార్ 2 ఈవెంట్.. నెటింట దుమారం రేపుతున్న నాగవంశీ కామెంట్స్..!

స్టార్ ప్రొడ్యూస‌ర్ నాగ‌వంశీకి తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి ప‌రిచ‌యాలు అవసరం లేదు. ఇండస్ట్రీలో వ‌న్‌ఆఫ్ ది క్రేజీ ప్రొడ్యూసర్ గా.. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తున్న ఆయన.. ఎప్పటికప్పుడు తన సినిమా ఈవెంట్లలో చేసే కామెంట్స్ ద్వారా హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఏ విషయాన్ని అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ సోషల్ మీడియాకు మంచి స్టప్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. నాగవంశీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెటింట పెద్ద దుమారంగా మారాయి.

ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్, త్రివిక్రమ్, దిల్ రాజు తో పాటు.. నాగ‌ వంశీ.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సంద‌డి చేశారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక.. అదే రోజున రజనీకాంత్ కూలి కూడా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే రెండు సినిమాల మధ్య టఫ్ వార్ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. కాగా తాజాగా సినిమాపై హైప్‌ను పెంచేందుకు వార్ 2 టీం ప్రమోషన్స్లో జోరు పెంచారు. ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ రైట్స్‌ సొంతం చేసుకున్న నాగవంశీ ఈ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

సినిమా చూసిన తర్వాత కచ్చితంగా షాక్ అవుతారు. ఏ మాత్రం మూవీ బాగోకపోయినా.. మాత్రం మళ్లీ మైక్ పట్టుకోను. సాధారణంగానే నన్ను తిడతారు కదా.. అప్పుడు పదింతలు ఎక్కువగా తిట్టండి.. థియేటర్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత అద్భుతమైన సినిమా అని అనిపించకపోతే ఎప్పుడు స్టేజ్ పై కనిపించను ఈ సినిమా చూడండి అని ఎప్పుడూ అడగను అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మొదటిరోజు వార్ 2 కలెక్షన్లు హిందీ వర్షన్ కంటే తెలుగులో ఒక్క రూపాయి అయినా ఎక్కువ రావాలి. దేవర కంటే పది రెట్లు కలెక్షన్లు రాబట్టాలి.. తారక్ అన్న పవర్ ఇండియా మొత్తం తెలియాలంటూ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాడు. అయితే.. నాగ‌వంశీ చేసిన ఈ కామెంట్స్ రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ విమర్శలు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. తమ‌ సినిమా బూస్టప్‌ ఇవ్వడం కోసం ఆడియన్స్‌ను రెచ్చగొడుతున్నారని.. కలెక్షన్ల కోసమే స్టేజ్ పై ఇలాంటి కామెంట్స్ తో అభిమానుల మనోభావాలను ఆడుకుంటున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మీ కలెక్షన్ల కోసం మమ్మల్ని వాడుకుంటారా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.