టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న అంటే నేడు తన 50వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న మహేష్.. ఏజ్ కనిపించకుండా తన గ్లామర్, ఫిట్నెస్తో ఆకట్టుకుంటున్నాడు. ఈ స్టార్ హీరో సినీ ప్రస్థానం, ఆస్తులు విలువలు, రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్టార్ హీరో కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి మహేష్ చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చాడు. తన సొంత టాలెంట్‌తో సూపర్ స్టార్ గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. 1979లో కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే నీడ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసిన మహేష్.. తర్వాత ఎన్నో సినిమాల్లో బాలు నటుడుగా తన నటనతో ఆకట్టుకున్నాడు.
రాజకుమారుడు సినిమాతో హీరోగా 1999లో టాలీవుడ్‌కు పరిచయమైన ఆయన.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఉత్తమ నటుడిగా నంది అవార్డును దక్కించుకున్నాడు. అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న రిచెస్ట్ సెలబ్రిటీస్ లో మహేష్ బాబు కూడా మొదటి వరుసలో ఉంటారు. ఆయన ఆస్తులు విలువ రూ.300 కోట్లకు పై చిలుకే అని సమాచారం. ఇక ఆయన రెమ్యూనరేషన్ లెక్కకు వస్తే.. ప్రతి సినిమాకు రూ.50 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట.
కాగా.. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29తో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మాత్రం ఏకంగా రూ.125 కోట్ల రెమ్యూనరేషన్‌ను ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. ఇది ఎంత పెద్ద మొత్తమైనా రాజమౌళి సినిమా కనుక ఆ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మహేష్ తన మొదటి సినిమా రాజకుమారుడు కు కేవలం రూ.75 లక్షలు మాత్రమే చార్జ్ చేశాడట. ఇక మహేష్ పర్సనల్ విషయానికొస్తే 2005 లో హీరోయిన్, బిజినెస్ పర్సన్ అయినా నమృత సిరోత్కర్ను వివాహం చేసుకున్నాడు. గౌతమ్, సీతారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. మహేష్ బాబుకు లేటెస్ట్ కార్స్ అంటే ఇష్టం. ఈ క్రమంలోనే తన గ్యారేజ్ లో ఎన్నో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దాదాపు రూ.30 కోట్లకు పైగా విలువ చేసే భారీ బంగ్లా ఉంది.