వార్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. హృతిక్ కంటే తారకే..!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్వహిస్తున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మెరవనున్నారు. బాలీవుడ్ నటి.. కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. అయితే.. తారక్‌కు ఇది మొట్టమొదటి బాలీవుడ్ సినిమా కావడం.. దానికి తగ్గట్లుగానే ఎన్టీఆర్ సినిమాల్లో విలన్ గా నెగటివ్ షేడ్స్‌లో నటించడంతో ఆడియన్స్ లో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరుకున్నాయి.

ఇక‌ ఆగస్టు 14న ఈ సినిమా హిందీతో పాటు.. తమిళ్, తెలుగు భాషల్లోనూ గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మూవీ.. యూ\ఏ స‌ర్టిఫికెట్ అందుకుంది. ర‌న్ టైం కూడా లాక్ చేసేసారు టీం. ఇక తెలుగు, తమిళ్ వెర్షన్లతో పోల్చితే.. హిందీలో రెండు నిమిషాలు న‌డవి ఎక్కువగా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. అటు తెలుగు, ఇటు హిందీ వర్షన్ రెండింటిలో ఈ సినిమాను ఒకేలా డిజైన్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ రివ్యూ తెగ వైరల్ గా మారుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్‌.. నెగిటివ్ కావడంతో ఆయనను తొక్కేస్తున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

కానీ.. తాజా రివ్యూ ప్రకారం వాటన్నింటికి సినిమాతో స్ట్రాంగ్ క్లారిటీ వచ్చేయనుందట. ఇక ఈ సినిమా.. థియేటర్లలో ప్రారంభమైన 20 నిమిషాల్లోనే ఎన్టీఆర్ ఎంట్రీ ఉండబోతుందని.. ఫ్రీ ఇంటర్వెల్ బ్యాంగ్‌ అయితే ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్ కు తీసుకువస్తారని.. ఫస్ట్ హాఫ్ అంతా.. తారక్ డామినేషన్ క్లియర్ గా అర్థమవుతుందని టాక్‌ నడుస్తుంది. దానికి తోడు ఫాన్స్‌ను పూర్తిగా ఆకట్టుకునే క్లైమాక్స్ ను అయాన్ ముఖర్జీ డిజైన్ చేశాడట. ఇలా.. మొత్తానికి హృతిక్ కంటే తార‌క్‌ డామినేషన్ సినిమాలో ఎక్కువగా ఉందంటూ టాక్‌ నడుస్తుంది. ఏదేమైనా.. తాజాగా ట్రెండ్ అవుతున్న ఈ ఫస్ట్ రివ్యూ.. సౌత్ ఆడియన్స్ లో హైప్ పెంచేసింది. మరి.. రజనీకాంత్ కూలికి టఫ్ కాంపిటీషన్ గా వస్తున్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.