హనుమాన్ లాంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంత ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. ఇంకా చాలా పనులు పెండింగ్ ఉండడంతో రిలీజ్ పోస్ట్ పని అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే వాస్తవం అయితే మరో రెండు వారాలు సినిమా వెనక్కు వెళుతుందట.
ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన రషస్ ప్రసాద్ ల్యాబ్స్లో వేశారట. కొంతమంది మీడియా మిత్రులతో కలిసి మేకర్స్ దీనిని వీక్షించారు. ఇక వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. సినిమా చూస్తున్నంతసేపు టాలీవుడ్, పాన్ ఇండియన్ సినిమా చూసినట్లు కాదు.. హాలీవుడ్ సినిమా చూసినా ఫీల్ కలిగిందని.. హనుమాన్ సినిమాలో రామతత్వం, హనుమాన్ భక్తి ఎంత డెప్త్‌తో చూపించారో.. క్లైమాక్స్‌లో హనుమాన్ ఎంట్రీ ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో గూస్ బంన్స్ తెప్పించిందో చూశాం. ఇప్పుడు ఈ సినిమాల్లో క్లైమాక్స్‌కు అదే రేంజ్ లో శ్రీకృష్ణుడు ఎంట్రీ ఉండనుందని.. ఆడియన్స్ లో ఆ ఎంట్రీ బిగ్ సర్ప్రైజ్ గా మారుతుందని అంటున్నారు.
ఓ ప్రముఖ స్టార్ హీరో కృష్ణుడి పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాదు.. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా మారిందట. అంతేకాదు.. సినిమాకు సంబంధించిన ఇతర హైలెట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని, కళ్ళు చమర్చి విజువల్స్, ఎంట్రీ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే ప్రతి సీన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని.. సెకండ్ హాఫ్ లో రెండు, మూడు యాక్షన్ సీన్లతో పాటే.. శ్రీకృష్ణుడు ఎంట్రీ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ కు తీసుకువస్తుందని చెప్తున్నారు. ఇక కొన్ని అంశాలు మైనస్‌లు కూడా ఉన్నాయట. అక్కడక్కడ హనుమాన్ పోలికలు కనిపిస్తున్నాయని.. బీ,సీ సెంటర్ ఆడియన్స్ కు అర్థం కాని కొన్ని సన్నివేశాలు సినిమాలో ఉన్నాయంటూ చెప్తున్నారు. ఓవరాల్ గా మాత్రం తేజ సజ్జకు మరోసారి బ్లాక్ బస్టర్ ఖాయమని.. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్‌ను అందుకుంటాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆడియన్స్ నుంచి సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందో చూడాలి.