తేజా సజ్జా “జాంబిరెడ్డి 2” బ్లాక్‌బస్టర్ హంగామా!

తేజా సజ్జా తన కెరీర్‌ను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడో మళ్లీ ఒకసారి నిరూపించుకున్నాడు. ‘హనుమాన్‌’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన తరువాత ఎన్ని ఆఫర్లు వ‌చ్చినా.. ఎంత భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా.. వెంటనే సైన్ చేయకుండా, కేవలం స్క్రిప్ట్ బలమే తనకు ప్రాధాన్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. తన లైనప్‌లో ఇప్పుడు ‘మిరాయ్‌’ ఉంది. ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్న తేజా.. వాటిలో ఒకదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళే వచ్చేసింది. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇంకా రిలీజ్ డేట్ కూడా ముందుగానే లాక్ చేశారు.

2027 సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అంటే మొదటినుంచే మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌పై ఎంత నమ్మకంతో ఉన్నారో చెప్పకనే చెప్పినట్టే. అయితే అసలైన బాంబ్ డేంజరస్ క్యాప్షన్‌తో పేలింది – “From Rayalaseema to End of the World”. ఈ లైన్‌ని ఫ్యాన్స్ డీకోడ్ చేస్తే.. ఇది ‘జాంబిరెడ్డి 2’ అన్న హింట్ స్పష్టంగా కనిపిస్తోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ‘జాంబిరెడ్డి’ అనేది తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన తొలి జాంబీ మూవీ. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు అలాంటి జానర్‌ని ఆమోదిస్తారా అన్న డౌట్స్ ఉన్నా.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఆ సినిమా మంచి హిట్ చేయించాడు. రాయలసీమ బేస్‌లో నడిచిన ఆ కథ.. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తోందని అర్థమవుతోంది. ఇక సీక్వెల్ స్టోరీ మరింత పెద్ద కాన్వాస్‌లో ఉండబోతోందని టాక్.

Zombie Reddy Sequel Confirmed: Bigger, Better, and Ready to Take Over the  Nation! - South Filmy Nagri

ఫస్ట్ హాఫ్‌లో రాయలసీమలో జరిగే ఇన్సిడెంట్స్‌తో స్టోరీ మొదలై.. సెకండ్ హాఫ్‌లో యుగాంతం వైపు మలుపు తిరగబోతోందని ఇన్‌సైడ్ టాక్. అంటే రీజినల్ టచ్‌తో పాటు యూనివర్సల్ కనెక్షన్ కలిగించేలా ప్లాన్ చేసినట్టుంది. అయితే ఇక్కడ ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేయడం లేదు. ఆయన ప్రస్తుతం ‘జై హనుమాన్‌’లో బిజీగా ఉన్నారు. కాబట్టి ‘జాంబిరెడ్డి 2’ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? అన్న కుతూహలం మాత్రం మరింత పెరిగిపోతోంది. త్వరలోనే మేకర్స్ ఆ మిస్టరీని రివీల్ చేయబోతున్నారని టాక్. ఏమైనా సరే.. తేజా సజ్జా లైనప్‌లో మళ్లీ ఒక పాన్-ఇండియా సెన్సేషన్ సెటప్ అవుతున్నట్టే. ఇప్పటికే ‘హనుమాన్‌’తో నెక్స్ట్ జెన్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ‘జాంబిరెడ్డి 2’తో బాక్సాఫీస్‌ మీద మళ్లీ మాస్ రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడు.