ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్‌పై రాజకీయపరంగా టార్గెట్ చేసి ఎంతోమంది ఆయనను బ్రష్టు పట్టించేందుకు రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వార్ 2 రిలీజ్ తర్వాత.. ఇవన్నీ మరింతగా పెరిగిపోయాయి. సినిమాలకు, రాజకీయాలకు అసలు సంబంధం లేకపోయినా.. కావాలనే ఎన్టీఆర్ సినీ విషయాలను రాజకీయాలతో ముడిపెడుతూ.. ఆయనను మరింత నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక తారక్ ఎప్పుడు ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకపోయినా.. కావాలని పొలిటికల్ కోణంలోకి ఆయనను లాగేసి సోషల్ మీడియాలో రకరకాలుగా చిత్రీకరిస్తూ నెగిటివ్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇంతటితో ఆగకుండా.. టీడీపీ ఎమ్మెల్యే ఆడియో లీక్ వివాదం మరింతగా వైరల్ చేశారు. అందులో వార్ 2 సినిమా పైన నెగటివ్‌గా మాట్లాడడమే కాదు.. ఎన్టీఆర్ తల్లిని గురించి కూడా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గురించి కెరీర్ ముగిసిపోయిందంటూ పోస్టులు షేర్ చేసుకోవడం పెద్ద సీన్‌గా మారింది. అంతేకాదు.. ఎన్టీఆర్ చాప్టర్ క్లోజ్ అంటూ.. ఇకపై సినిమాలకు ఎన్టీఆర్ గుడ్ బై చెప్పేసినట్లే అంటూ.. రకరకాలుగా ట్రోల్లింగ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ రేంజ్ లో ఎన్టీఆర్ పై ట్రోల్స్ జరుగుతున్నా.. ఆయన రియాక్ట్ అవ్వకపోవడంతో దాన్ని కూడా ఒక వివాదంలో సృష్టించారు. ఎన్టీఆర్ సైలెన్స్ వెనుక ఎదో పెద్ద ప్లాన్ ఉందని ఊహాగానాలను వ్యక్తం చేశారు.
అయితే.. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తారక్ అన్న దీనిపై రిప్లై ఇవ్వాల్సిందేనని.. ఒక్క దెబ్బతో అందరి నోళ్లు ముసేలా రెస్పాన్స్ ఉంటే బాగుంటుందంటూ ఎంతగానో ఆశపడ్డారు.. ఇప్పుడు అదే జరుగుతుంది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్టుకు సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానందాన్ని టీం అఫీషియల్ గా వెల్లడించారు, ఇందులో పవర్ఫుల్ యాక్షన్ సీన్స్,, హార్ట్ టచింగ్ సీక్వెన్స్ షూట్ చేయనున్నట్లు చెప్పకనే చెప్పారు, ఈ అప్డేట్‌తో పాట్టే.. పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయడం ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఫుల్ కం బ్యాక్ లుక్‌లో కనిపిస్తూ,, సోషల్ మీడియాలో హీట్ పెంచేశాడు, ట్రోల్ చేసిన వాళ్ళ అందరికీ తారక్ ఇచ్చిన ఈ సింగిల్ షాట్‌తో నోళ్లు మూత పడిపోయాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఒకే ఒక్క పోస్టర్తో ఎన్టీఆర్ సోషల్ మీడియాను బ్లాస్ట్ చేశాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియన్స్ సైతం చూసి ఏదో బిగ్గెస్ట్ కాన్సెప్ట్ తోనే తారక్ వస్తున్నాడేమో.. ఖచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ పాస్టర్ పడతాడని చర్చలు మొదలుపెట్టారు. ఎన్నాళ్లు సోషల్ మీడియాలో జరిగిన నెగటివ్ ట్రోలింగ్స్ అంతటికి ఒకే ఒక్క పోస్టర్తో తుడిచిపెట్టినట్లు అయిపోయిందని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.