టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో టాలెంటెడ్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్‌స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ మొదలైపోతుంది. దానికి ప్రధాన కారణం సుకుమార్ సినిమా డైరెక్షన్‌లో తీసుకునే కొన్నే డెసిషన్స్. తను రాసుకున్న కథ ఏదైనా హిట్ అవుతుందా.. ఫ్లాప్ అవుతుందా.. ఇతరులు ఏమనుకుంటారు అని అసలు పట్టించుకోని సుక్కు.. ఆ స్క్రిప్ట్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే హీరో ఎవరు.. సెట్ అయ్యే హీరోయిన్ ఎవరనే విషయాలపై మాత్రం చాలా పక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు.
దానిపై చాలా వర్క్ చేస్తాడు. ఇక చివరిగా పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న సుకుమార్.. రామ్ చరణ్ తో నెక్స్ట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబోలో మూవీ అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమా షూట్ లో గడుతున్నాడు. ఈ సినిమా పూర్తైన వెంటనే.. సుకుమార్ చరణ్‌తో సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో హిరోయిన్ గా.. మొదట రష్మిక తర్వాత మమత బైజు లాంటి పేర్లు వినిపించినా.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ మెరవనుందని టాక్.
అయితే.. సుకుమార్ తీసుకున్న ఈ డెసిషన్ చాలా రిస్కీ డేసిషన్ అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఆమె.. తాజాగా డెలివరీ అయింది. హార్మోన్ ఛేంజస్ వల్ల రూపురేఖలన్నీ మారిపోతాయి. ఇలాంటి క్రమంలో ఆరు నెలలు టైంలో సుకుమార్ కియారాను సెట్స్ పైకి తీసుకువచ్చి మునిపటిలా అందంగా చూపించగలడా.. అది కూడా రామ్ చరణ్ సరసన ఆమె మెప్పించగలరా.. అసలు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు.. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబోలో గతంలో వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇలాంటి క్రమంలో మరోసారి కియారా అద్వాని, రామ్ చరణ్ జంటగా సినిమాను తీసే రిస్క్ అవసరమా అంటూ సుకుమార్ తన డిసిషన్ మార్చుకోవడం బెటర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి సుకుమార్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.