టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్ఆర్, బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎమ్‌బి 29 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. కాగా.. తాజాగా సినిమా టైటిల్ రివిల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమరున్.. ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారని.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ సినిమా ప్రమోషన్స్ కోసం జేమ్స్ కెమరున్ ఇండియాకి రానున్న సంగతి తెలిసిందే. అదే టైంలో రాజమౌళి, మహేష్ కాంబో మూవీ టైటిల్‌ను ఆయన చేతిలో మీదుగా రిలీజ్ చేయాలని జక్కన్న టీం మాస్టర్ ప్లాన్ వేశారట.
ఇదే వాస్తవం అయితే మాత్రం ఇండియన్ సినీ చరిత్రలో మైల్డ్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోతుంది. కారణం.. గతంలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్‌లో జేమ్స్ కామరున్ రేంజ్‌లో ప్రశంసించాడు. తన సినిమాలో భాగం కావడానికి అవకాశం కావాలంటూ ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ఈ టైటిల్ అనౌన్స్మెంట్ జేమ్స్ కామరున్ చేతుల మీదగా జరిగితే.. వీరి బంధం మరింత బలపడుతుందని ఆరాటపడుతున్నారు. సినిమా టైటిల్ నవంబర్ 25న రిలీజ్ చేస్తామని గతంలో రాజమౌళి అఫీషియల్‌గా చెప్పుకొచ్చారు. మహేష్ 50వ పుట్టినరోజు సందర్భంగా మినీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఇక.. ఈ సినిమాలో మహేష్ ఫేస్ రివిల్ చేయకున్నా.. సాహసికుడు చాతిని చూపించినట్లు ఫోటో ఉంది దీంతో లుక్ తెగ వైరల్ గా మారింది. గ్లోబల్ జంగల్ అడ్వెంచరస్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో.. మహేష్ బాబు అడ్వెంచన్స్ పర్సన్ గా కనిపించనున్నాడని టాక్ ఇండియన్ జోన్స్ తరహా అడ్వెంచర్స్ ఆఫ్రికన్ జానపద కథల నుంచి ఈ సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్నారని టాక్ నడుస్తుంది. ఇక సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం మెరవనున్నారు. ఈ ప్రాజెక్టును దాదాపు 900 నుంచి 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రాజమౌళి రూపొందిస్తున్నట్లు సమాచారం. కాగా.. సినిమా టైటిల్ రివిల్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన మేకర్స్ నుంచి రావాల్సి ఉంది.