టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతోంది. సక్సెస్‌లతో సంబంధం లేకుండా.. అమ్మడి క్రేజ్ అంతకంతకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమాలతో పాటు, ఐటం సాంగ్స్‌లోను మెరుస్తూ ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీ గా గడిపేస్తుంది. ఇక నెక్స్ట్ మాస్ జాతర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది.
ఈ క్రమంలో శ్రీ లీల ఇటీవల జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరించిన జయంబు నిశ్చయంబురా ప్రోగ్రాంలో సందడి చేసింది. శ్రీలీలతోపాటు.. ఈ ప్రోగ్రాంలో ఆమె తల్లి కూడా పాల్గొంది. ఇందులో ఆమె చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ప్రోగ్రాంలో జగపతిబాబు.. తారక్ చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తున్న ఫోటోను డిస్ప్లే చేశాడు. అది చూసిన శ్రీలీల తల్లి (స్వర్ణలత) నాకు ఈ ఫోటో చూసిన తర్వాతే ఆడపిల్ల పుడితే డ్యాన్స్ నేర్పించి ఇండస్ట్రీకి పంపించాలనే ఫీల్ కలిగింది.
1997లో లాస్ ఏంజెల్స్ లో తానా సభలు ఏర్పాటు చేశారు. మేము కూడా అక్కడికి వెళ్దాం. అక్కడ తారక్ డ్యాన్స్ చేసిన తర్వాత.. నేను అతనితో మాట్లాడా. నాకు అమ్మాయి పుడితే కచ్చితంగా నీలా డ్యాన్స్ చేపిస్తా అని చెప్పా. అనుకున్నట్లే శ్రీ లీలను డ్యాన్సర్‌గా చేశా అంటూ స్వర్ణలత కామెంట్స్ చేసింది. ఎన్టీఆర్ స్పూర్తితోనే నా కూతురు డ్యాన్సర్ అయిందని వివరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.