టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా దాదాను అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది సమంత. అద్భుతమైన నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ పాత్రలకే కాదు.. ఎక్స్పరిమెంటల్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ప్రతి సినిమాతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. 2010లో గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్గా మారింది. దాదాపు దశబ్దం కాలంపాటు.. ఇండస్ట్రీని షేక్ చేసిన శ్యామ్.. అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది.
ఇండస్ట్రీలో ఇన్స్పిరేషనల్ కపుల్ గా ఎంతో కాలం రాణించిన ఈ జంట.. వారిద్దరి మధ్య విబేదాల కారణంగా డివోర్స్ తీసుకున్నారు. నాగచైతన్య శోభితను వివాహం చేసుకోగా.. సమంత ప్రస్తుతం సోలో లైఫ్ లీడ్ చేస్తుంది. అంతేకాదు.. వీళ్ళ విడాకుల తర్వాత.. మయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధితో పోరాడిన సమంత.. చాలా కాలంగా సినిమాలకు దూరంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఆమె చూపించిన ధైర్యం.. పోరాటపటిమా.. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. తాజాగా.. ఆ వ్యాధి నుంచి కోలుకొని మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమంత.. బాలీవుడ్ వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టి అక్కడ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాణిస్తుంది.
ఇలాంటి క్రమంలో సమంత తీసుకున్న నిర్ణయం నెటింట సంచలనంగా మారింది. సినిమాలను తగ్గించేయాలని ఆమె ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది. గత అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అంటూ చెప్పిన సమంత.. ఇప్పుడు తన లైఫ్‌లో శారీరక, మానసిక ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నానని క్లారిటీ ఇచ్చింది. గతంలోలా వరుస ప్రాజెక్టులలో బిజీగా ఉండకూడదని.. తన శరీరం చెప్పే మాటలు విని తక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. అయితే.. ప్రాజెక్టుల సంఖ్య తగ్గినప్పటికీ నాణ్యతతో మాత్రం ఎక్కడా రాజీ పడకూడదని.. ప్రేక్షకుల మనసుకు నచ్చే కథలను మాత్రమే ఎంచుకున్న నటిస్తానంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.