కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రజనీకాంత్ పలు సినిమాలో నటించినా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయితే.. ప్రస్తుతం ఆయన నటించిన కూలి సినిమా మాత్రం మళ్లీ అదే రేంజ్ లో హైప్ క్రియేట్ చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతుంది. మరో నాలుగు రోజుల్లో అంటే ఆగస్టు 14న సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఏడుపాదుల వయసులోనూ రజినీకాంత్ అసాధారణమైన ఆటిట్యూడ్, గ్రేస్‌తో డ్యాన్స్ స్టెప్పులతో ఆడియన్స్ ఆకట్టుకుంటున్నాడు.అంతేకాదు.. తన పర్ఫామెన్స్‌కు తగ్గ రేంజ్‌లో రెమ్యూనరేషన్ను కూడా అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక.. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన కూలి సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇలాంటి క్రమంలో.. కూలీ సినిమా బడ్జెట్ గురించి సినీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారుతుంది. రజనీ.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ప్రాజెక్టు నడుస్తుంది. సినిమాకు దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సినిమా కూడా ఇదేనట. ఈ సినిమాలో రజిని రెమ్యూనరేషన్తోనే మరో మీడిల్ రేంజ్ సినిమాను ఈజీగా తీసేయొచ్చు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేవలం రజినీకాంత్ కాదు.. లోకేష్ కనకరాజ్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, సత్యరాజ్, శృతిహాసన్ ఇలా సినిమాలో నటించిన ప్రతి నటీనటుడు సాంకేతిక నిప్పులతో సహా ప్రతి ఒక్కరు భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇలా కేవలం రెమ్యునరేషన్‌కే భారీ బడ్జెట్ కేటాయించిన మేకర్స్.. సినిమా ప్రచారం కోసం కూడా భారీ లెవెల్ లో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా ప్రమోషన్స్ కి దాదాపు రూ.25 కోట్ల వరకు ఖర్చు జరిగిందట. అలా రెమ్యూనరేషన్లు సినిమా ప్రమోషన్స్ ఖర్చులు, టెక్నికల్ టీమ్, రెమ్యూనరేషన్లు అన్నీ మొత్తం కలుపుకొని రూ.375 కోట్లకు పైగానే బడ్జెట్ అయిందని అంచనా. ఇక తమిళ్ తో పాటు.. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆగస్టు 14న సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటుందో.. చూడాలి.