టాలీవుడ్ ఇండస్ట్రీలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా.. మరో 25 రోజుల్లో గ్రాండ్ గా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. సినిమా కోసం కేవలం పవన్ అభిమానులు కాదు.. ఇండస్ట్రీ వర్గాలు, సినీ ప్రియులు, ట్రేడ్ పండితులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే సరైన బిజినెస్ లేక డీలా పడిపోయిన టాలీవుడ్ మార్కెట్‌కు పూర్వ వైభవం రావాలంటే.. ఇలాంటి భారీ క్రేజ్ ఉన్న సినిమా కచ్చితంగా రిలీజ్ అవ్వాలి. దానికి మించి పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి అనడంలో సందేహం లేదు. ఇక ఇప్పటికే.. సినిమాకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో చెప్పాలంటే రీసెంట్గా ఓపెన్ చేసిన నార్త్ అమెరికన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏ ఉదాహరణ.
ఏ ఇండియన్ సినిమాకు లేని రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ సినిమాకు రికార్డులు సృష్టిస్తున్నాయి. బుకింగ్స్ మొదలై నాలుగు రోజులకే దాదాపు నాలుగు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఇక సినిమాకు ఈ రేంజ్‌లో హైప్ ఉంటే.. మేకర్స్ కచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోక మానరు. ఈ క్రమంలోనే ఓజీ పర్సంటేజ్‌ను ఫ్యాన్స్ ముందుకు తీసుకువచ్చారు. మేకర్స్ ఓసి అనే టైటిల్‌తో ఉండే ఈ క్రేజీ హుడీస్‌ను మొత్తం నాలుగు మోడల్స్‌గా డిజైన్ చేయించి వదిలారు. ఈ నాలుగు హుడీస్ కూడా ఆన్లైన్‌లో క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. మార్కెట్‌లో ఒక్క హుడ్డిని కూడా వదలకుండా ఎగబడి మరి కొనేస్తున్నారు. కేవలం వీటి ద్వారానే మేకర్స్‌కు ఐదు కోట్ల లాభాలు వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు చరిత్రలో ఏ సినిమాకు కూడా ఈ రెండిట్‌లో హైన్ మొదలవలేదు.
అప్పట్లో పవన్ నటించిన జానీ సినిమా రిలీజ్‌కి ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో జానీ బ్రాండ్స్ ఓ రేంజ్‌లో ట్రెండ్ సృష్టించాయి. ఎక్కడ చూసినా అవే కనిపించేవి. ఇప్పుడు మరోసారి అలాంటి మానియా ఓజీ సినిమాతో మొదలైంది. ఈ జనరేషన్ ఫ్యాన్స్ దానిని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే హుడీలు మొత్తం హాట్ కేకులా అమ్ముడుపోగా.. సినిమాకు సంబంధించిన పూర్తి మెర్సేడైజ్.. సెప్టెంబర్ 1న వెబ్సైట్లో పెట్టానన్నారు. వీటికి ఏ రేంజ్ లో డిమాండ్ ఏర్పడుతుందో చూడాలి. కాగా వీటి కాస్ట్ చాలా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంత ధర పెడితే ఎంత ఫ్యాన్స్ అయినా.. ఎగబడి మరి కొనలేరు. కానీ సెప్టెంబర్ 1 కైనా అందుబాటులో ఉండే రేట్స్ పెట్టండి అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మేకర్స్ అభిమానుల కోరిక తీరుస్తారా.. లేదా రేపు తెలిసిపోతుంది. ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ లేదా పోస్టర్ అయినా రిలీజ్ చేసే అవకాశం ఉంది.