కూలి సినిమాకు కొత్త తలనొప్పి.. హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ కాంట్రవర్సీ..!

కోలీవుడ్ థ‌లైవార్ రజనీకాంత్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్లో నాగార్జున నెగిటివ్ షేడ్స్‌లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజై.. ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ బ‌జ్‌ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే కూలీ కాంట్రవర్సీలకు కూడా దారితీసింది.

Rajinikanth's Coolie Poster Sparks Plagiarism Row, Netizens Call It to 100 Percent Copy Of Dakota Johnson And Sydney Sweeney Starrer Madame Web

మేకర్స్‌ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్లను రిలీజ్ చేయగా.. ఈ పోస్టర్లు కారణంగా పెద్ద వివాదం చోటుచేసుకుంది. ఈ పోస్టర్ హాలీవుడ్‌కు చెందిన మడమే వెబ్ సినిమా పోస్టర్లకు కాఫీ అంటూ.. సోషల్ మీడియా వేదికగా న్యూస్‌ వైరల్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్‌లో భాగంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో.. మూవీలోలో నటిస్తున్న స్టార్ కాస్టింగ్ ఫోటోలు అన్నీ బ్యాగ్రౌండ్‌తో ఒక్కొక్కటిగా చూపించారు. ఇక మధ్యలో మెయిన్ లీడ్‌గా.. రజినీకాంత్ ఫోటోని ఉంచారు. అయితే.. దీనిపై మేకర్స్ అఫీషియల్ గా ఎక్కడ రియాక్ట్ కాలేదు.

కానీ.. సినిమాపై తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. విజువల్స్ కూడా కాపీనే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీని ఇంపాక్ట్ సినిమా ప్రమోషన్స్‌పై కూడా పడే అవకాశం ఉంది. అయితే.. ఇది సదరు హాలీవుడ్ సినిమా స్టోరీతో పోలి ఉందా.. లేదా.. అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక లోకేష్ కనకరాజ్‌.. కోలీవుడ్‌లో ఒక ఒరిజినల్ కంటెంట్ మేకర్ అనే మార్క్‌ ఉంది. ఇప్పటివరకు ఎలాంటి కాపీ రైట్, కంప్లైంట్ లేదు. అలాంటి లోకేష్.. ఈ పోస్టర్‌తో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇది ఆయన సమక్షంలో డిజైన్ చేయించిన పోస్టరా.. లేదా తాను సంప్రదించకుండానే గ్రాఫిక్స్ టీం ఇలా క్రియేట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది.