నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. మొదట్లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఓ సినిమా వస్తుందంటూ అఫీషియల్ గా మోక్షజ్ఞ లుక్‌తో ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేయగా అది నెటింట తెగ వైరల్‌గా మారింది. అయితే.. తర్వాత ఆ ప్రాజెక్ట్ పై కూడా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా నటుడు నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీకి వచ్చేందుకు నందమూరి వారసులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారంటూ వెల్లడించాడు. ఇటీవల తను మోక్షజ్ఞతో మాట్లాడినప్పుడు స్క్రిప్ట్ కోసం చూస్తున్నాం అంటూ చెప్పాడని.. ఈ ఏడాది చివర్లో.. లేదా వచ్చేయడానికి స్టార్టింగ్ లోనే అతని ఎంట్రీ ఉండే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చాడు.
ఇండస్ట్రీకి రావడం కోసం తన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని.. నారా రోహిత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమాల కోసమే పూర్తిగా తన లుక్ మార్చేసాడని.. గతంలో లుక్ కంటే ఇప్పుడు మరింత మార్పు వచ్చిందంటూ వివరించాడు. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం మోక్షజ్ఞ వెతుకుతున్నాడని.. ఇటీవల నేను కలిసినప్పుడు నాతో అన్నాడు. అలాంటి కథ ఉంటే ఈ ఏడాదిలోనే ఎంట్రీ ఉండే అవకాశం ఉంది అంటూ నారా రోహిత్ వివరించాడు. ఇక బాలయ్యతో తన మల్టీస్టారర్ పై నారా రోహిత్ రియాక్ట్ అవుతూ గతంలో స్క్రిప్ట్ రెడీ చేసినట్లు వివరించాడు. కథ రెడీ చేసారు.. మా ఇద్దరి లుక్ టెస్ట్ కూడా అయిపోయింది. కథ ఇద్దరికీ నచ్చేసింది.
కానీ.. అదే టైంలో ఆయనకు వరుస ప్రాజెక్ట్, ఎలక్షన్ రావడంతో సినిమా సెట్స్‌పైకి రాలేదు. బాలయ్య నటించిన మరో సినిమాలోని నాకు ఆపీరియన్స్ ఇచ్చారు. కానీ.. అది కూడా కొన్ని కారణాల వల్ల వర్కౌట్ కాలేదు. ఆ సినిమా స్థానంలోనే ఆయన లెజెండ్ సినిమా నటించారు. భవిష్యత్తులో బాలయ్యతో కలిసి నటించే అవకాశం ఉంది. కచ్చితంగా కలిసి చేస్తాం. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ నారా రోహిత్ వివరించాడు. ఇక రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. నేను టైం దొరికినప్పుడల్లా కార్యకర్తల్లో కలిసిపోతున్న.. ప్రజలకు మంచి చేయడం కోసం నేను సిద్ధమే అంటూ వివరించాడు. ప్రస్తుతం నారా రోహిత్ సుందరకాండ మూవీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక ఈనెల 27న సినిమా ఆడియన్స్‌ను పలకరించింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. హీరో పెళ్లి కష్టాలు ప్రధానంగా తీర్చిదిద్దిన ఈ వీడియో నవ్వులు పోయించింది.