టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్య దేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు గౌతం తిన్ననూరి దర్శకుడుగా వ్యవహరించగా.. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్‌లో రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
ఈ క్రమంలోనే.. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను సైతం ఫిక్స్ చేసుకుందట. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామైన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వైరల్ గా మారుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సైతం సోషల్ మీడియా వేదికగా సరికొత్త పోస్టర్తో అఫీషియల్ గా ప్రకటించారు. ఇక సినిమాలో కోలీవుడ్ నటుడు వెంకటేష్ విపి, అలాగే అయ్యప్ప శర్మ తదితరులు కీలకపాత్రలో మెరిసి ఆకట్టుకున్నారు.
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని మేకర్స్ మొదట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం విజయ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తయిన వెంటనే.. ఈ సినిమాను తీసుకువస్తామంటూ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఆగష్ట్ నెలాకరకు.. లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ అవుతుందని సమాచారం.