” కింగ్డమ్ ” డే 1 కలెక్షన్స్.. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ రికార్డ్..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కింగ్‌డ‌మ్‌. సత్యదేవ్‌ మరో కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమా గురువారం.. అంటే నిన్న గ్రాండ్ లెవెల్‌లో రిలీజై.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రీమియర్ షోస్ ఓవర్సీస్‌తో పాటు.. ఇండియాలోను పలుచోట్ల ప్రదర్ఖిత‌మై.. పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే కింగ్డమ్ భారీ లెవెల్లో ఓపెనింగ్స్ ను దక్కించుకుని దూసుకుపోతుంది.

ఓవర్సీస్లో అయితే నెక్స్ట్ లెవెల్ వ‌సూళ్ల‌ను రాబడుతుందని మేకర్స్ వెల్లడించారు. ఇక ఇండస్ట్రీ ట్రాకర్ అయిన సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం ఇండియాలో కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు రూ.15.50 కోట్లకు పైగానే క‌లెక్ట్ చేసిన‌ట్లు వివరించింది. అంతేకాదు.. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్‌ అని.. కేవలం విజయ్ దేవరకొండకే కాదు.. మీడియం రేంజ్ హీరోలలో ఎవరు ఈ రేంజ్ ఓపెనింగ్స్ ను ఫస్ట్ డే కలెక్షన్స్ లో దక్కించుకోలేకపోయారని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇక గౌతం తిన్న‌నూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు మొదటి రోజు ఆక్యుపెన్సీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో జరిగింది. ఇప్పటికీ అదే హైప్‌ కొనసాగుతుందని సమాచారం. మార్నింగ్ షోలలో 63.56% ఆక్యుఫెన్సీ, మధ్యాహ్నం 56.52%, ఈవ్‌నింగ్‌ షో లకు 50.12% అక్యుపెన్సీ న‌మో దు అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో కింగ్డంకు మొదటి రోజు 56.53 శాతం అక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. ఇక తమిళ్ వెర్షన్కు 15.67 ఆక్యుఫెన్సీ ఉందట. ఇక ఉత్తర అమెరికాలో అయితే ఈ సినిమాకు 6,50,000 డాలర్లు అంటే.. దాదాపు రూ.5.42 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కాయి.