టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబుకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా జగపతిబాబు ప్రేమించుకుందాం రండి అంటూ ఓ వీడియోను యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇందులో ఆయన తన లైఫ్, కెరీర్, టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అభిమానుల ప్రశ్నలు.. వ్యాఖ్యలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పుకొచ్చాడు. ఇక.. ఈ వీడియోలో అభిమని మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ చాలా బోరింగ్ గా ఉందని.. పరిశ్రమల బంధుప్రీతి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయకుండా అడ్డుకుంటుందంటూ ప్రశ్నించగా.. తనకి జగపతిబాబు కౌంటర్ ఇచ్చాడు. జగపతిబాబు ఈ వ్యాఖ్యలను చాలా గట్టిగా చదువుతూ.. ఆ అభిమాని చేసిన రెండు ప్రకటనలతోనూ నేను అస్సలు ఏకీభవించనంటూ వివరించాడు.
తెలుగు మూవీస్ బోరింగ్ గా ఉంటే చూడకండి అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. తర్వాత నటుడు జగపతి బాబు బంధుప్రీతి (నెపోటిజం) గురించి రియాక్ట్ అయ్యాడు. నిర్మాత, దర్శకుడు.. విబి.రాజేంద్రప్రసాద్ తనకు సినీ ఇండస్ట్రీలో ఎలా తలుపులు తెరిచాడు.. అనే దాని గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. దాని నిలబెట్టుకోవడానికి నేను ఎంతగానో కష్టపడ్డాను అంటూ వివరించాడు. నెపోటిజం కొత్త ప్రతిభను సినిమా పరిశ్రమ లోకి రాకుండా ఆపుతుందనేది అసలు నిజమే కాదని.. నేడు చాలామంది కొత్త నటీనటులు ఓటిపి, చిన్న చిన్న సినిమాలలోనూ ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారని.. సినీ కుటుంబాల నుంచి ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సక్సెస్ సాధించలేకపోవడం మనం చూస్తూనే ఉన్నామంటూ వివరించాడు.
ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను సినీ కుటుంబం నుంచి వచ్చా. అది ఇండస్ట్రీలో ప్రవేశించడం తప్ప.. నాకు మరేమీ సహాయం చేయలేకపోయింది. నన్ను నేను నిలబెట్టుకోవడానికి నేనే కష్టపడాలి. టాలీవుడ్‌లో అతిపెద్ద స్టార్స్.. కొణిదెల, అల్లు, అక్కినేని, ఘటయనేని, దగ్గుబాటి లాంటి సినీ కుటుంబాల నుంచి కూడా ఎంతోమంది వచ్చారు. జగపతిబాబు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లోను మెరిశారు. 1989లో సింహాసనం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు.. 1990 – 1992లో ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ప్రధాన పాత్రల్లో అవకాశాలు తగ్గిపోయినా.. తర్వాత 2014 బాలయ్య నటించిన లెజెండ్ సినిమా లో విలన్ పాత్రతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరిసాడు. ఇక చివరిగా పుష్ప 2 ది రూల్ సినిమాలో స్క్రీన్ పై కనిపించిన జగపతిబాబు.. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాలోను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.