ఆ పని తర్వాతే నేను ప్రశాంతంగా నిద్రపోయా.. గౌతం తిన్ననూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ కింగ్డమ్. ఇటీవ‌ల రిలజైన ఈ మూవీ ఆడియన్స్‌లో పాజిటీవ్ టాక్ ద‌క్కించుకుంది. బలమైన ఎమోషన్స్ తో ఆకట్టుకున్ని.. ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని.. ఈ క్రమంలోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని.. డైరెక్టర్ గౌతం తిన్ననూరి తాజాగా సక్సెస్ మీట్ లో వెల్లడించారు. శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జూలై 31న గ్రాండ్ గా రిలీజ్ అయింది.

ఇక.. ఈ క్రమంలోనే సోమవారం గౌతమ్ తిన్ననూరి విలేకరులతో మాట్లాడుతూ.. నిజానికి విజయ్‌ దేవరకొండతో చేద్దాం అనుకున్న స్టోరీ ఇది కాదని.. మా ప్రయాణం మొదలైన తర్వాత కింగ్డం కథ‌ అయితే.. తనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనిపించింది.. వెంటనే చెప్పేసా. ఆ స్టోరీ ఆయనకు కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్‌ని ఆడిషన్స్ చేసినప్పుడు సినిమా పట్ల తనకున్న కసి, తపన చూసి మురుగన్ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నా. వెంటనే సత్యదేవ్ గారు ఓకే చెప్పారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక.. ఈ సినిమా రిలీజ్‌కు ముందు.. చివరి నిమిషం వరకు కూడా తుది మెరుగులు దిద్దడానికి ఎంతగానో ప్రయత్నించాం.

ఈ క్రమంలోనే సరిగ్గా నిద్ర కూడా పోలేదు అంటూ చెప్పుకొచ్చాడు గౌతం తిన్ననూరి. ఇక.. ఈ సినిమా నుంచి హృదయం లోపల.. సాంగ్‌ను థియేటర్లలో తొలగించాం. కథ‌ గమనానికి.. ఈ సాంగ్ అడ్డంకి గా మారకూడదు అనిపించింది. నేను , ఎడిటర్ నవీన్ నూలి, నాగవంశీ, విజయ్ గారు అందరం కలిసి డిస్కషన్ చేసిన తర్వాత.. అందరూ ఒప్పుకున్న తర్వాతే ఆ సాంగ్ సినిమా నుంచి తీసేసాం. ఓటిటి వర్షన్‌లో సాంగ్‌తో పాటు.. కొన్ని సన్నివేశాలు కూడా జోడించి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నామంటూ వివరించాడు. ఇక కింగ్డమ్ సెకండ్ భాగం సిద్ధంగానే ఉంది. స్క్రిప్ట్ వర్క్ త్వరలోనే ప్రారంభిస్తా. ఈలోపు ఒక ఓటిటి వెబ్ ఫిలిం చేస్తా అంటూ వివరించాడు. ప్రస్తుతం గౌతం తిన్ననూరి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.