గతంలో సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా ఆయనే కథ, కంటెంట్ సంబంధం లేకపోయినా.. స్టార్ హీరోల సినిమాలు అయితే చాలు సక్సెస్ అందుకునేవి. ఇప్పుడు కేవలం స్టార్ హీరోల చరిష్మా సరిపోదు.. కచ్చితంగా సినిమాలో అద్భుతః అనిపించే కంటెంట్ ఏదో ఉండాలి. ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలి. అప్పుడే సినిమా సక్సెస్ అందుకుంటుంది. దీనికి అసలైన నిదర్శనం ఈ ఏడాదిలో రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు. చిన్నచిన్న సినిమాలుగా రిలీజై కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. రికార్డులు క్రియేట్ చేసిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. అలాగే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కి కంటెంట్ కారణంగా డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమాలు సైతం ఉన్నాయి.
ఇలాంటి క్రమంలోనే తాజాగా ఓ చిన్న సినిమాపై ఆడియన్స్ అందరి దృష్టిపడింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో తేజా సజ్జా.. మంచు మనోజ్, శ్రియా కీలకపాత్రలో మెరిసిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజై.. ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ కాయమని.. విజువల్ వండర్లా ఉందంటూ.. ఆడియర్స్ టీజర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే.. నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొంది. ఇక ప్రస్తుతం ఏదో అంతంత మాత్రమే కంటెంట్ ఉంటే కాదు.. లార్జర్ ధెన్ లైఫ్ స్టోరీస్ ఉంటేనే సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి.
కాగా.. మొదట్లో మీరాయ్ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు డైట్ లేదు. ఇటీవల ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మీనింగ్ ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కాగా.. మీరాయ్ అనేది.. ఓ జపనీస్ పదం అట. భవిష్యత్తు కోసం ఆశ అని దీని అర్థం. ఇందులో తేజ సజ్జ యోధుడిగా.. భవిష్యత్తు కోసం ఏం చేశాడనేది ప్రధాన బ్యాక్ డ్రాప్‌గా తెలుస్తుంది. ఇక ఇప్పటికే బ్యాక్ డ్రాప్ ను ఓ హిస్టారికల్ డ్రామాగా ఆడియన్స్‌కు పరిచయం చేశారు మేకర్స్. అశోకుని కాలం.. రహస్యమైన ఓ శాసనమని.. దాని గురించి సినిమా రిలీజ్ అవుతుందని ఆడియన్స్ లో క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ కథను రూపొందించడానికి చాలా అంశాలను నేర్చుకున్నాను అని డైరెక్టర్ కార్తీక్ వివరించారు.
ఇక స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్.. తన సొంత సినిమాకు విజువల్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా.. కష్టపడినట్లు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తోనే అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల అందరిలో వైవిధ్యమైన కాన్సెప్ట్ ఎంచుకుంటూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న వారిలో.. తేజ సజ్జా మొదటి వరుసలో ఉంటాడు. హనుమాన్ లాంటి మంచి సక్సెస్ తర్వాత తేజ ఎంచుకున్న మీరాయ్ సినిమా ఆడియన్స్‌లో మరింత హైప్ పెంచింది. ఈ క్రమంలోనే తేజ సబ్జా పై కూడా ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది. తక్కువ బడ్జెట్ తో హనుమాన్ రేంజ్ లో క్వాలిటీ అవుట్ పుట్ మీరాయ్ సినిమాతో కచ్చితంగా వస్తుందని. ఆడియన్స్ భావిస్తున్నారు.