ధనుష్ – మృణాల్ మధ్య డేటింగ్ వార్తలు.. ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

సౌత్ సూపర్ స్టార్ ధనుష్.. స్టార్ బ్యూటి మృణాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలకు తగ్గట్టుగానే ఇటీవల కాలంలో ధనుష్, మృణాల్‌ కలిసి పదేపదే జంటగా మెరుస్తున్నారు. రీసెంట్గా మృణాల్ బర్త్‌డే పార్టీలో ధనుష్ సందడి చేసిన పిక్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఆమె నటించిన సన్నాఫ్ సర్దార్ 2 మూవీ ప్రీమియర్స్ సైతం ధనుష్ హాజరు కావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది.


ఇదే క్రమంలో ధనుష్ – మృణాల్‌ మధ్య ఏజ్ గ్యాప్‌పై నెటింట‌ వార్తలు మరింత హాట్‌ టాపిక్‌గా మారాయి. 1983 జూలై 28న‌ జన్మించిన ధ‌నుష్‌.. ఇటీవ‌ల 42 ఏళ్ల వయసును కంప్లీట్ చేసుకున్నాడు. మృణాల్ ఠాగూర్ 1992 ఆగస్టు 1న జన్మించింది. రీసెంట్‌గా.. తన 33వ బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే.. ధనుష్ – మృణాల్ మధ్య ఏజ్ గ్యాప్ 9 ఏళ్లంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి.

ఏజ్ గ్యాప్ సంగతేమో కానీ.. మృణాల్‌, ధనుష్‌తో డేటింగ్ అంటూ వార్తలు వినిపిస్తున్న క్రమంలో.. మృణాల్‌ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఫ్రీ స‌జెష‌న్స్ ఇవ్వ‌డం ప్రారంభించారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న టైంలో చూసి వ్రాంగ్ డెసిష‌న్‌ తీసుకుంటున్నావ్ అంటూ.. కాస్త తెలివిగా ఆలోచించమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.