కూలీ ప్రీమియర్ రివ్యూ.. లోకేష్ హిట్ ట్రాక్ రిపీట్..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ క‌న‌క‌రాజ్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఎన్నో అంచనాల నడుమ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే ఓవర్‌సిస్‌, ఆంధ్ర, తమిళనాడు లాంటి కీలక ప్రదేశాల్లో ప్రీమియర్ సోషల్ ముగించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఫస్ట్ షో రన్ అవుతుంది. ఇక సినిమా రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ ను క్రియేట్ చేసిన నేపథ్యంలో.. రజిని ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ సినీ లవర్స్ సైతం సినిమా చూసేందుకు ఆ ఎగబడ్డారు. థియేటర్ల దగ్గర బారులు తీరి మరి టికెట్స్ కొనుగోలు చేశారు. ఆన్లైన్‌లోను.. రికార్డు లెవెల్ లో టికెట్లు విక్రయించారు. అయితే.. ఇప్పటికే సినిమా చూసిన చాలామంది నెటిజ‌న్స్.. సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూలను అందించారు. ఇంతకీ.. సినిమా ఆడియన్స్‌ని ఎలా ఆకట్టుకుందో.. లోకేష్ హిట్ ట్రాక్ కూలీతో రిపీట్ అయిందా లేదా చూద్దాం.

సినిమా టైటిల్ కార్డ్‌తో మొదలుకొని.. రజినీపై తనకున్న అభిమానాన్ని లోకేష్ చూపించాడు. రజిని 50 ఏళ్ల సినీ లైఫ్‌ను అందరికీ చూపించేలా చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు. అలాగే.. ఇందులో నటించిన ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీ ఎంట్రీ సీన్స్.. కిక్ ఇచ్చెలా డిజైన్ చేశాడని చెప్తున్నారు. ఇక సత్యరాజ్ కూతురుగా శృతిహాసన్ ఆకట్టుకుంది. ఇక సైమన్ అక్రమాలను అరికట్టేందుకు.. సత్యరాజ్ కూతురు శృతిహాసన్ తో కలిసి ప్రారంభించిన మిషన్ ఫెయిలవుతుంది. అదే టైంలో సత్యరాజ్ ఫ్రెండ్ రజిని.. మిషన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని.. ట్విస్టులు అదిరిపోతాయి అంటూ చెబుతున్నారు.

ఈ క్రమంలోనే రజినీకాంత్ ఫ్రెండ్ గా ఉపేంద్ర ఎంట్రీ ఉంటుందని.. క్లైమాక్స్లో అమీర్ ఖాన్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా.. లోకేష్ తన మార్క్‌.. సినిమాతో చూపించాడని.. ఎక్కడ బోర్ ఫీల్ కలగకుండా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేశాడంటూ వివరిస్తున్నారు. అంతేకాదు.. సినిమా ప్రచారానికి రాని.. ఇద్ద‌రు స్టార్స్ కామియో రోల్స్‌లో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేయనున్నాయట. మౌనిక సాంగ్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకున్నాయని.. మాస్ ఆడియ‌న్స్‌కు గూస్ బంప్స్ అంటూ చెబుతున్నారు.

Viral Song Monica: Pooja Hegde shines in 'Monica' from 'Coolie,' song hits  10 million views

యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటున్నాయని.. ది బెస్ట్ గా డిజైన్ చేశారని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక సాంగ్స్ సోసోగానే ఉన్నా.. బక్కోడు అనిరుధ్‌ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మూవీ గ్రాఫ్ అమాంతం పెంచేసింది అంటూ చెబుతున్నారు. ఇక పాత్రలను ఎలివేట్ చేసేటప్పుడు కూడా వచ్చే బిజిఎం ఇరగదీసిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా స్టోరీలో కొత్తదనం లేకున్నా.. కథ మొత్తం ముందే ఆడియన్స్ కు తెలుస్తున్న ఎక్కడ అలాంటి బోర్ ఫీల్ రాకుండా మంచి స్క్రీన్ ప్లే తో లోకేష్ మాయ చేసాడట. నాగరాజు ర‌జినీల మ‌ధ్య వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంటుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హ‌ఫ్ అదిరిపోయిందని.. సెకండ్ హాఫ్ మాత్రం స్లోగా సాగిన బోర్ ఫీల్ కలగలేదు.. స్ట్రాంగ్ క్లైమాక్స్ తో ఇక సెకండ్ హాఫ్ గ్రాఫ్ ను లొకేష్ పెంచాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ధియేటర్ ఎక్స్పీరియన్స్ చేయవలసిన సినిమా అంటూ చెప్తున్నారు.