విజయ్ దేవరకొండ హీరోగా.. గౌతమ్ తిననూరి డైరెక్షన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించగా.. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ఇక.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మూవీ టీం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ ఓవర్సీస్ లో మేము ఎంతకైతే విక్రయించామో దానికి 50 శాతం తిరిగి వచ్చేసిందని.. రాయలసీమలోను 50 శాతం రాబట్టాం అని వివరించాడు.
నైజాంలో దాదాపు రూ.8 కోట్ల గ్రాస్ రావచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆంధ్రా లోను.. మేము ఊహించిన రేంజ్‌లోనే కలెక్షన్లు వస్తున్నాయంటూ వివరించాడు. స్క్రీన్ ప్లే పరంగా కొందరు రెట్రో మూవీతో పోలిస్తున్నారని రిపోర్టర్ ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ దానిపై రియాక్ట్ అయ్యాడు. నేను సినిమా చూడలేదు. చూశాక చెబుతా. అయినా.. రిట్రో మూవీలో.. హీరోకి బ్రదర్ ఉంటాడా అంటూ ప్రశ్నించాడు. సూర్య పాత్రలో లీనమయ్యారు కదా. దాన్నుంచి ఎలా బయటకు వచ్చారనే ప్రశ్నకు విజయ్ మాట్లాడుతూ.. దాన్నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసి నెక్స్ట్ సినిమా రోల్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నా. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుందంటూ వివరించాడు.
ఇక సినిమా రిలీజ్ డేట్ సడన్గా చేంజ్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుందనే పకరశ్నకు చిరాకు వస్తుందంటూ వివరించాడు. ఇక కింగ్డమ్ పార్‌ట్ 2 ఎప్పుడు అనే ప్రశ్న ఎదురు కాగా.. నాగవంశీ మాట్లాడుతూ.. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ పూర్తయిన తర్వాత కింగ్డమ్ 2 చేస్తామని.. అందులో ఓ పెద్ద హీరో కూడా కనిపించనున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. హీరోయిన్ రోల్ స్పేస్ మరీ తక్కువగా ఉంది ఏంటి అనే ప్రశ్నకు నాగవంశీ.. పార్ట్ 2లో హీరోయిన్ రోల్‌కు స్కోప్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చాడు. ఇక ప్రమోషన్స్ ప్లాన్ చేశారా అని అడగగా.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రాయలసీమలో, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణలో చేశాం. సక్సెస్ ఈవెంట్ ను ఆంధ్రాలో సోమవారం జరిగేలా ఏర్పాట్లు చేస్తాం అంటూ వివరించాడు. ప్రస్తుతం రిపోర్టర్ల ప్రశ్నలకు కింగ్డమ్ టీం చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలను వైరల్ గా మారుతున్నాయి.