వార్ 2 ఈవెంట్లో నాగ‌వంశీ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే కామెంట్స్‌.. !

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీకి ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో వ‌న్ అప్ ది క్రేజీ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎప్పటికప్పుడు తన సినిమా ఈవెంట్లలో సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాకి మంచి స్టప్ గా మారుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరిగా ఆయన కింగ్డమ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత స్పెషల్ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. విజయ్ దేవరకొండ, నాగ వంశీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది.. రివ్యూవర్స్ సినిమాలను ఏ విధంగా నెగటివ్ చేసి చూపిస్తున్నారు.. అనే విషయాలపై బోల్డ్ కామెంట్స్ చేస్తూ హాట్‌ టాపిక్‌గా మారారు.

War 2 stars Hrithik Roshan and Jr NTR tease ideological and physical clash  at Hyderabad ...

మరోసారి తాజాగా నాగవంశీ చేసిన కామెంట్స్ ఫాన్స్ కు షాక్ ను కలిగించాయి. వార్ 2 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ మాటలు సెన్సేష‌న‌ల్‌గా మారాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా వార్ 2 మానియా కొనసాగుతుంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో.. హృతిక్ రోషన్ హీరోగా మెరిసిన ఈ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో హై లెవెల్ లో ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో మరింత జోరుని పెంచాలని ఫిక్స్ అయ్యారు టీం. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వన్ అఫ్ ది చీఫ్ గెస్ట్ గా నాగవంశీ హాజరై సందడి చేశారు.

War 2 Pre-release event: Naga Vamsi says it feels like we are not sending  NTR to Bollywood, but welcoming Hrithik Roshan to Tollywood | - Times of  India

ఆయన ఈ ఈవెంట్లో మాట్లాడిన మాటలు అందరికీ షాక్‌ను కలిగించాయి. ప్రస్తుతం నాగవంశి ..స్టేట్మెంట్స్ వైరల్ గా మారాయి. ఇప్పటివరకు చాలా ఈవెంట్లలో ఎంతో కాన్ఫిడెంట్ గా తన సినిమా రిజ‌ల్ట్ కోసం నాగవంశీ మాట్లాడుతూ వచ్చాడు. ఈ సినిమా విషయంలోనూ అదే తరహాలో స్టేట్మెంట్ ఇచ్చాడు. సాధారణంగా అందరూ నన్ను ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు.. ఈ సినిమా చూసి నచ్చకపోతే అంతకు పదింతలు తిట్టండి అంటూ డేరింగ్ ఛాలెంజ్ విసిరాడు. అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అంతలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దీంతో సినిమా అవుట్ పుట్ విషయంలో తాను ఎంత నమ్మకంగా ఉన్నారనేది ఆడియన్స్ కు క్లియర్ గా అర్థమైంది. సూర్యదేవర నాగవంశీ ఇంత క్లారిటీగా.. డేర్ అండ్ డ్యాషింగ్‌ కామెంట్స్‌ చేశాడు అంటే కచ్చితంగా కంటెంట్ లో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుందంటూ జనాలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నాగవంశీ అందరూ నన్ను తిట్టుకుంటారంటూ చేసిన కామెంట్స్ కు ఫ్యాన్స్ షాక్ అయినా.. సినిమాపై హైప్‌ను పెంచేందుకు దాన్ని కూడా నాగవంశీ స్పాంటేనియస్‌గా వాడుకున్నాడు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత డేరింగ్ గా సినిమాపై కామెంట్ చేయడం నీవల్లే అవుతుంది బాస్.. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు అంటూ.. నీ డేర్ కి మెచ్చుకోవచ్చు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.