టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాలతో పాటు.. మరోపక్క సినిమాల్లోనూ రాణిస్తూ బిజీబిజీగా గడుతున్నాడు. ఇక పవన్ ప్రజెంట్ నటిస్తున్న మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇప్పటికే సినిమాపై భారీ హైప్ నెలకొంది.
సినిమా నుంచి తాజాగా వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ డూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక సినిమా నెక్స్ట్ ట్రీట్ గా స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15వ క్రేజీ అప్డేట్ మేకర్స్ రిలీజ్ చేస్తారంటూ టాక్ తెగ వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంతా దానికోసం ఎంతో ఎక్సైటెడ్‌గా ఎదురు చూశారు. కానీ.. మేకర్స్.. లేటెస్ట్ గా ఫాన్స్‌ను డిసప్పాయింట్ చేసే ఓ షాక్ ఇచ్చారు.
ఈ 15 న ఎలాంటి అప్డేట్ రావడం లేదంటూ.. ఏమన్నా ఉంటే మేము అఫీషియల్ గా వెల్లడిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటూ వివరించారు. అలా.. ప్రజెంట్ స్వతంత్ర దినోత్సవానికి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదంటూ చెప్పేశారు. ఇక.. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతుంది. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. అదే రోజున బాలకృష్ణ అఖండ 2 సైతం రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక ఓజీ వర్సెస్ అఖండ 2 మధ్య కాంపిటేషన్ ఎలా ఉండనుందో చూడాలి.