అఖండ 2 లేటెస్ట్ అప్డేట్.. ఇక బాలయ్య పని అయిపోయిందా..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. ఈ సినిమా షూట్‌ను కంప్లీట్ చేసుకున్న మేకర్స్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమా కోసం బాలయ్య పని పూర్తి అయిపోయిందని.. తాజాగా షూట్‌ మొత్తం కంప్లీట్ చేసుకున్న బాలయ్య.. ఇప్పుడు డబ్బింగ్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసినట్లు మూవీ టీం అఫీషియల్ గా వెల్లడించారు.

All eyes on Akhanda 2 update

గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే తెర‌కెక్కిన అఖండ‌ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ గా వస్తున్న క్రమంలో.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ అభిమానుల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక మూవీ మేకర్స్ సైతం ఊహకు అందని రేంజ్‌లో తాండవం ఉండబోతుంది అంటూ వివరించారు. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శ‌రవేగంగా జరుగుతున్నాయి.

Akhanda 2': Samyuktha joins the cast of Nandamuri Balakrishna - Boyapati  Sreenu's film - The Hindu

ఇక సెప్టెంబర్ 25న సినిమాను.. దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు టీం. కాగా.. సినిమాల్లో ఇతర కాస్టింగ్ డబ్బింగ్ వర్క్ తాజాగా ప్రారంభమైందట. మరోవైపు.. రీ రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్, సీజీ పనులను కూడా పూర్తి చేశాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తూ పూర్తి చేస్తున్నారు మేకర్స్‌. సినిమా త్వ‌ర‌గా కంప్లీట్ చేసి.. సెప్టెంబర్‌లో చెప్పిన రిలీజ్ డేట్‌కు అన్ని సంసిద్ధంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక.. సినిమాలో సంయుక్త మీన‌న్‌ హీరోయిన్గా నటిస్తుండగా.. హర్షాలి మల్హోత్రా, ఆది పిన్నిశెట్టి.. తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు.