టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్, రాజకీయాలలోను సక్సెస్ అందుకోవడంతో.. నెంబర్ వన్ సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్ లో నెక్స్ట్ లెవెల్లో హైప్ మొదలైంది. ఇక.. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సక్సెస్‌ల ట్రాక్‌ను అఖండ 2.. కచ్చితంగా కంటిన్యూ చేస్తుందని.. ఈసారి ఇండియా లెవెల్లో రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న దసరా కానుకగా రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. సినిమా షూట్ పూర్తయిన ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుందని.. ఈ క్రమంలోనే సినిమా వాయిదా పడుతుందంటూ గత కొంతకాలంగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
దానికి తగ్గట్టుగానే.. రిలీజ్ డేట్‌కు ఎంతో సమయం లేకున్నా.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన కనీసం ప్రమోషనల్ కంటెంట్‌ని కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు. ఒక్క సాంగ్ అయినా ఫ్యాన్స్‌తో పంచుకోలేదు. ఈ క్రమంలోనే.. ఆ వార్తలు నిజం అంటూ సెప్టెంబర్ లో సినిమా ఉండే అవకాశాలు లేవంటూ.. అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక మేకర్స్ సైలెన్స్‌కు కారణం కూడా అదే అయ్యి ఉంటుందని.. ఇంకో వారం ఆగితే కచ్చితంగా సినిమాకు నెల గ్యాప్ మాత్రమే మిగిలి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో.. వేచి చూడాలి.