సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా ప్రపంచం. ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుంది.. ఎవరి లక్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఏదేమైనానా ఇండస్ట్రీలో హిట్లు కొట్టేవరకే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కసారి డిజాస్టర్ మూటకట్టుకుంటే.. వారిని ఇండస్ట్రీ పట్టించుకోదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ కు సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్‌గా మారుతుంది. సాధారణంగా స్టార్ హీరో డైరెక్టర్‌ల కాంబోలో సినిమా తెరకెక్కుతున్నప్పుడు.. ఆ సినిమాలో హీరోయిన్, డైరెక్టర్ల మధ్యన కూడా మంచిర్యాపో ఏర్పడుతుంది. దర్శకులు వాళ్ళతో అంతగా క్లోజ్‌గా ఉండటానికి కారణం కూడా ఆమెను హీరోయిన్గా ఎంచుకోవాలని ఉద్దేశం. ఇలా చాలా సందర్భాల్లో హీరోయిన్లతో మంచి రిలేషన్ షిప్ ను మైంటైన్ చేసిన దర్శకులు ఎంతోమంది ఉంటారు.
అది చాలా కామన్. అయితే.. ఇలాంటి క్రమంలోనే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ పెళ్ళై.. భార్య ఉన్నా.. హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకొని భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని.. ఆమె తనకు విడాకులు ఇచ్చేసిందంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. డైరెక్టర్ పేరు పక్కన పెడితే.. ఇప్పటికే ఆ దర్శకుడు ఏదైనా సందర్భంలో మాట్లాడాల్సి వస్తే.. ఇదే విషయాన్ని ఇన్‌డైరెక్టుగా ప్రస్తావిస్తూ ఉంటాడట. ఇండస్ట్రీలో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు వ్యవహరించాలి.. ఏమాత్రం తప్పటడుగు వేసిన వాళ్ల మధ్యన రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ప్రమాదం ఉందని వివరిస్తూ ఉంటారట.
ఈ క్రమంలోనే ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న అప్ కమింగ్ దర్శకులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి సక్సెస్ అందుకున్న తర్వాత హైఫై లైఫ్‌ను అలవాటు పడిపోయిన ముద్దుగుమ్మలు.. తమ కెరీర్‌ను ఎలాగైనా ఇండస్ట్రీలో కొనసాగించాలని.. ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోవడానికి అయినా అసలు ఆలోచించడం లేదని.. వాళ్ళు తీసుకునే రాంగ్ డెసిషన్‌తో..ఎదుటి వ్యక్తి కుటుంబంలోనూ కలహాలు తప్పట్లేదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.