కింగ్డమ్ కు అండగా వైసీపీ.. పవన్ రికార్డ్స్ బ్రేక్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్. జులై 31న అంటే నేడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. కింగ్డమ్ రిలీజ్ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారీ సినిమాలో నడుమ ఈ సినిమా రిలీజ్‌ విజయ్కు పెద్ద సవాలనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ చిన్న తేడా వచ్చినా.. ఈ సినిమాపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాగా.. సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ, హీరో దేవరకొండ మాత్రం సినిమా కంటెంట్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. తిరుమల వెంకన్న దయ, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఉంటే బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటూ విజ‌య్ దేవరకొండ స్ట్రాంగ్‌గా చెప్పాడు. ఇలాంటి క్రమంలో.. గతంలో బాయికాట్ హరిహర వీరమల్లు అంటూ ట్రెండ్ చేసిన‌ వైసీపీ ఫ్యాన్స్.. ఇప్పుడు బ్లాక్ బాస్టర్ కింగ్డమ్ అంటూ.. కింగ్డమ్ సినిమాకు సపోర్ట్‌గా నినాదాలు చేస్తుండడం హ‌ట్ టాపిక్‌గా మారింది.

రిలీజ్‌కు ముందే.. కింగ్డమ్ సినిమా ఓ అరుదైన‌ రికార్డ్‌ ఖాతాలో వేసుకుంది. వీరమల్లు సినిమాకి వచ్చిన అడ్వాన్స్ బుకింగ్స్‌ బ్రేక్ చేస్తూ.. ఓవర్సీస్‌లో కింగ్‌డం ఊహించని రేంజ్‌లో బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్.. ఓవర్సీస్‌లో కొద్దిరోజుల క్రితమే ప‌స్రారంభ‌మై కేవలం ప్రీమియర్ షోస్‌కే 1 మిలియన్ డాలర్ గ్రాస్ వ‌సూళ్ల‌ను కొల్లగట్టినట్లు తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 40 వేల డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. కీగా.. వీరమల్లు ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌ అడ్వాన్స్ బుకింగ్ దక్కించుకోలేకపోవడంతో.. పవన్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే.. ఎలాంటి మద్దతు ఉన్నా.. సినిమాలో కంటెంట్ లేకపోతే చివరకు ఎలాంటి రిజల్ట్స్ అందుకోవాల్సి వస్తుందో తెలిసిందే.

ఈ క్రమంలోనే ట్రైలర్లో స్టోరీని చెప్పేయడం.. టీంకు పెద్ద సవాలుగా మారింది. కథ తెలిసిన తర్వాత.. ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయాలంటే.. అది అంత సులువు కాదు. ఆద్యంతం మలుపులు, ట్విస్టులు, కొత్తదనంతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి. రొటీన్ సీన్స్‌తో.. గ్రిప్ లేని స్టోరీ ఉంటే.. సినిమాకు ఆడియన్స్ ఎవరూ రారు. ప్రేక్షకులు థియేటర్లను రప్పించే బలమైన కంటెంట్‌తో దేవరకొండ ఆకట్టుకున్నాడా.. లేదా.. తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. అయితే.. ఇప్ప‌టికే ముగిసిన‌ప్రీమియర్‌స్ నుంచి మాత్రం పాజిటీవ్ టాక్‌ దక్కించుకుంది. ఇక సినిమా ఫుల్ రిజల్ట్ తెలియాలంటే ఫస్ట్ షో రిజల్ట్ వచ్చేవరకు చూడాల్సిందే. మరి సినిమా ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటుందో.. రౌడీ హీరో కింగ్ అవుతాడో.. లేదో.. చూడాలి.