టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. యష్ రాజ్ ఫిలిం యూనివర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో ఆగస్టు 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానుల సైతం ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న క్రమంలో టాలీవుడ్ ఆడియన్స్ లోనే సినిమాపై మంచి క్యూరియాసిటీ మొదలైంది.
కాగా తారక్ పుట్టినరోజు సందర్భంగా.. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది నిమిషాల క్రితం సినిమా నుంచి ట్రైలర్ రిలీజై మెప్పించింది. ఎప్పుడెప్పుడా అని పాన్ ఇండియా లెవెల్‌లో అభిమానులంతా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ రానే వచ్చింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ తెలుగుతో పాటు.. హిందీ, తమిళ భాషల్లోనూ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ మధ్యన వచ్చే సన్నివేశాలు.. ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటున్నాయి. ఇక హీరోయిన్ కియారా సైతం భారీ యాక్షన్స్ సన్నివేశాలతో ఆడియన్స్‌ను మెప్పించేలా కనిపిస్తుంది.
తారక్, హృతిక్ పాత్రలు ఒకరి పాత్రను మించిపోయే రేంజ్ లో పవర్ ఫుల్ గా మరొకరి పాత్ర ఉందని క్లారిటీ వచ్చేసింది. అయితే.. హృతిక్ రోషన్ దేశంపై నెగటివిటీతో పోరాడుతుంటే.. ఎన్టీఆర్ దేశం కోసం పోరాడే సైనికుడిగా కనిపించనున్నాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ క్రమంలోనే పవర్ ఫుల్ ట్రైలర్ ఆడియన్స్ అంచనాలను అమాంతం పెంచేస్తుందటంలో అతిశయట్లేదు. ఇక ట్రైలర్‌లో విఎఫ్ఎక్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటుంది. యష్ రాజ్ ఫిలిం స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాల్లో.. యాక్షన్ ఎలిమెంట్స్, గ్లామర్, స్టార్ పవర్ అన్ని కలగలిపి సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ ట్రైలర్ వైరల్ గా మారడంతో.. సినిమా బ్లాక్ బస్టర్ పక్క అంటూ.. గూస్ బంప్స్ ఖయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.