బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ సినిమాకు సీక్వెల్‌గా వార్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ లో భాగంగా.. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాల్లో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌తో పాటు.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మెరవనున్నారు ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో ట్రెండ్ చేస్తున్నారు.
అయితే.. కొద్ది గంటల క్రితం సినిమాకు సంబంధించిన ట్రైలర్ హిందీతో పాటు.. తెలుగు, తమిళ భాషలను రిలీజై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ట్రైలర్‌లో హృతిక్, తారక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్.. అభిమానులను నెక్స్ట్ లెవెల్ లో ఎంటర్టైన్ చేశాయి. ఇక.. ఈ సినిమా తారక్ బాలీవుడ్ డబ్ల్యూ మూవీ కావడం తో సినిమాపై క్యూరియాసిటీ మరింతగా పెరిగింది. సినిమా ట్రైలర్‌లో చూపించిన తారక్ సిక్స్ ప్యాక్ లుక్, ఫైటర్ జెట్స్ తో సన్నివేశాలు.. ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్‌తో ఈ సినిమా 2025 ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.
ఇండిపెండెన్స్ డే రోజున రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా భారీ లెవెల్‌లోనే వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ నాగవంశీ సొంతం చేసుకున్నారు. మొత్తంగా వార్ 2 ఓ యాక్షన్ ఫీస్ అవుతుందని.. హృతిక్, తారక్ మధ్య యుద్ధం బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని సినీ స్లేషకులు చెబుతున్నారు. వార్ 2 దేశవ్యాప్తంగా డాల్బీ అట్మోస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ రికార్డును అందుకున్న మొట్టమొదటి ఇండియన్ సినిమా వార్ 2 కావడం విశేషం. ఈ క్రమంలో ఇరు హీరోల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.