స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు బాలీవుడ్ లోనూ అమ్మడు పల్లు సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే తిరుగులేని ఇమేజ్‌తో దూసకపోతున్న సామ్.. ఇటీవల కాలంలో సినిమాల కంటే డైరెక్టర్ రాజు నిడమారుతో ప్రమాణం నడుస్తుందంటూ.. రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలతోనే ఎక్కువ వైరల్ అవుతుంది. అయితే.. ఈ వార్తలను సామ్ పట్టించుకోకుండా.. తన పని తాను చూసుకుంటూ బిజీబిజీగా గడిపేస్తుంది. ఇలాంటి నేపద్యంలో అమ్మడికి సంభంధించిన ఓ వీడియో నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.
సమంత కు ఫిట్నెస్ అంటే ఎంత ఇష్టమో దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎక్కువ సమయాన్ని జిమ్ లోనే గడుపుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే జిమ్‌లో 100 కిలోల బరువును కూడా ఎత్తిన వీడియోలు గతంలో నెటింట తెగ వైరల్ గా మారాయి. ఆమెను చూసి ఫాలోవర్‌లు సైతం ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌ను తీసుకుంది. 90 సెకండ్ల పాటు ఈ ఎక్సర్సైజ్‌ను చేసి అందరికి షాక్ ఇచ్చింది.
దీనికి సంబంధించిన వీడియో ను ఆమె ట్రైనర్ ఒక్కరు సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నారు. టెట్ 20 హెల్త్ అనే ఫోడ్‌కాస్ట్ సిరీస్‌లో సమంత ఎప్పుడూ తన ఆరోగ్యనికి, ఫిట్నెస్‌కు సంబంధించిన విషయాలను అందరితోనూ షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సమంత ట్రైనర్ ఆమె స్వీకరించిన ఈ డెడ్‌హ్యాంగ్ ఛాలెంజ్‌గురించి వివరించారు. మీరు ఎలా కనిపిస్తున్నారు అనేది అసలు మ్యాటర్ కాదు.. మీ వారసత్వం ఏమిటనేది ముఖ్యం కాదు.. సెల్ఫీలు పంచుకోవడం కూడా కాదు.. ఎవరు చూడనప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారనేదే ముఖ్యం అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జోడించాడు. ఇది చూసిన వాళ్లంతా సామ్ నిజంగానే చాలా స్ట్రాంగ్ అంటూ.. ఇది ఆమె నిజమైన ప్ట్రెంత్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram