టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్‌వీరుడు హృతిక్ రోషన్ ప్రాధాన్ పాత్రల్లో నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది ఆగష్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ నిర్మాత నాగ వంశీ దక్కించుకోవడం మరో విశేషం. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాను ఓ డైరెక్టర్ తెలుగు సినిమా రేంజ్‌లో రిలీజ్ చేయడానికి నిర్మాత నాగ వంశి ఎంతగానో కష్టపడుతున్నారని.. మొదటి నుంచి వివరిస్తున్న ఆయన దేవర లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ చేసి హైయెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇక తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయినా ట్రైలర్‌తో ఆడియన్స్‌లో సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. దీంతో సినిమా అత్యధిక వసూలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇలాంటి క్రమంలో వార్ 2లోనే యష్ రాజ్ ఫిలిమ్స్‌పై యూనివర్స్‌కు సంబంధించిన మరో రెండు కొత్త సినిమాల ఇన్పుట్‌లు ఏమైనా ఉన్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్‌తో పాటు ప్రీ క్లైమాక్స్ స్టోరీలో భాగంగా పఠాన్ 2, ఆల్ఫా సినిమాలకు సంబంధించిన కొన్ని పాత్రలను పరిచయం చేయనున్నారట టీం. ఇక ఇప్పటికే బాలీవుడ్‌లో ఈ రెండు సినిమాల కోసం అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్పై థ్రిల్లర్ పఠాన్ సినిమా సీక్వెల్ రానుంది. ఇప్పటికే దానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి.
త్వరలోనే సినిమా అప్డేట్ కూడా రియల్ చేయనున్నారట టీం. అయితే.. పఠాన్ 2కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇంకా రివ్యూ కాకపోయినా వాటిలో ఈ సినిమా ఇన్పుట్స్ ఉంటాయని టాక్ నడుస్తుంది. ఇక వైఆర్‌ఎస్‌పై యూనివర్సిటీ రాబోతున్న మరో మూవీ ఆల్ఫా. లేడీ ఓరియంట్ స్పై థ్రిల్లర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్‌గా మెరవనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇన్పుట్‌ను సైతం వార్ 2లో ఇవ్వనున్నారని తెలియడంతో సినిమాపై అక్కడ ఆడియన్స్ లో మరింత హైప్ పెరిగింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌తో పాటు.. బాలీవుడ్ లో సినిమా భారీ లెవెల్ లో హైప్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఇదే వార్ 2కు అక్కడ మరింత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే నిజమై సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ వస్తే మాత్రం బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.