సోషల్ మీడియాలో పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్ ఎవరి గురించంటే..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తమిళ్‌లోను తన సత్తా చాటుకుంది. అయితే.. మెల్ల మెల్లగా టాలీవుడ్ లో వరుస ఫ్లాప్‌లు రావడంతో తెలుగు సినిమాలకు దూరమైనా.. బాలీవుడ్‌కు మక్కాం మార్చేసింది. అక్కడ కూడా పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు.. పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సందడి చేస్తుంది. ఇక కెరీర్‌ పిక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్ స్టార్ నటుడు ప్రొడ్యూసర్‌ను వివాహం చేసుకొని మ్యారీడ్ లైఫ్ లోకి అడుగుపెట్టింది.

పెళ్లి తర్వాత.. అమ్మ‌డు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందని.. గ్లామర్ షోలకు దూరంగా ఉంటుందంటూ ఎన్నో వార్తలు వినిపించిన వాటన్నింటిని తిప్పికొడుతూ గ్లామర్ షో తో అంతకంతకు రెచ్చిపోతుంది. అడపా దడపా సినిమాలోని మెరుస్తుంది. అయితే.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇటీవల.. మేరే హస్బెండ్ కి బీవి సినిమాలో ప్రేక్షకులను పలకరించిన రకుల్.. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్‌ దక్కించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ రకరకాల పోస్టులను షేర్ చేసుకుంటుంది. అలాగే.. తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తుంది.

ఈ క్రమంలోనే.. తాజాగా సోషల్ మీడియాలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువైపోయారు అంటూ మండిపడింది. ఇంతకీ అసలు మేటర్ ఏంటో.. అంతగా కోపం రావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. తాజాగా.. రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రిటీలపై నెగటివ్ కామెంట్లు చేస్తున్న వారిపై మండిపడింది. సోషల్ మీడియా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. దురదృష్టం ఏంటంటే మన దేశంలో చాలామందికి పని పాట ఏం లేదు. వాళ్ళందరికీ ఉచిత డేటా ప్లాన్లు అందుబాటులో ఉండడంతో ఇతరుల జీవితాల గురించి వారికి నచ్చినట్లుగా కామెంట్లు చేస్తూ.. వాళ్లు బాధపడతారేమో అని ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. వారికి ఇంకేమీ పని లేకుండా పోయిందంటూ చెప్పుకొచ్చింది. మన దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు అంటూ వివరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రకుల్ కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజ‌న్స్‌ ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతుండగా.. మరి కొందరు మాత్రం మండిపడుతున్నారు.