త్వరలోనే ” అతడు 2 ” కథ రెడీ.. హీరో మాత్రం మహేష్ కాదా.. మురళీమోహన్ షాకింగ్ అప్డేట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఐదు ప‌దుల‌ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. త‌న‌ ఫిట్నెస్, అందంతో ఆకట్టుకుంటున్నాడు. భారీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. కాగా.. ఆయన సినీ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలలో అతడు మూవీ ఒకటి. సినిమా ధియేటర్లలో కంటే.. బుల్లితెరపై పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే.. థియేటర్‌ల‌లోను సినిమా ఫ్లాప్ ఏమి కాదు. ఒక రూపాయి కూడా ఈ సినిమా వల్ల నష్టపోలేదని తాజాగా సినిమా ప్రొడ్యూసర్ జయభేరి బ్యానర్స్ అధినేత, నటుడు మురళీమోహన్ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అతడు మూవీ పేరు మీద ఎప్పటికీ చెరిగిపోని ఒక క్రేజీ రికార్డు కూడా ఉంది. అదేంటంటే.. ఇప్పటికే సినిమాను బుల్లితెరపై దాదాపు 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి ప్రతిసారి మంచి ప్రేక్షకదరణ దక్కించుకుంటుంది.

Athadu Sequel Will Only Be With Mahesh Babu and Trivikram -Murali Mohan |  cinejosh.com

ఇలాంటి రికార్డు మరే సినిమాకు దక్కలేదు. అయితే.. అలాంటి మహేష్ నటించిన హిట్ సినిమా అతడు కి సీక్వెల్ ఉంటుందా.. దానికి హీరో ఎవరు.. అనే ప్రశ్నలు మురళి మోహన్‌ఖు ఎదురయ్యాయి. దీనిపై ఆయ‌న ఎలా రియాక్ట్ అయ్యారు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మహేష్ బాబు, త్రిష జంటగా నటించిన అతడు సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది అగ‌ష్లు 9న రీ రిలీజ్ చేయ‌నున్నారు. ఈ క్రమంలోనే తాజా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్‌మీట్‌లో సందడి చేశారు మురళీమోహన్. ఇందులో భాగంగానే అత‌డు పార్ట్ 2 తీస్తారా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. కచ్చితంగా సినిమాకు దర్శకుడు, హీరో టైం ఇస్తే.. పార్ట్ 2 తీస్తా. త్రివిక్రమ్ దర్శకత్వంలోనే.. మహేష్ బాబు హీరోగానే ఈ సినిమా తీయాలి.

Athadu

ఎందుకంటే.. హీరోని మార్చేస్తే సినిమాను ఎవరు చూడరు. వాళ్ళు డేట్స్ ఇస్తే అతడు 2 సినిమా చేస్తా అంటూ వివరించాడు. అంతేకాదు.. ఈ సినిమా వల్ల నేను రూపాయి కూడా నష్టపోలేదంటూ చెప్పుకొచ్చిన మురళీమోహన్.. ఇప్పుడు సినిమా రిలీజ్‌ విషయంలో చాలా ఆనందంగా ఉందని.. కారణం అప్పుడు సినిమాను థియేటర్లలో చూడటం చాలా మంది మిస్ అయ్యారు.. ఇప్పుడు రీ రిలీజ్ లో సినిమాను చూడొచ్చని వాళ్లంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటూ వివ‌రించాడు. అలాగే సినిమా ఫ్లాప్ కావడం వల్ల డైరెక్టర్, హీరో రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసారు అన్న వార్త అవాస్తవమే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మురళీమోహన్ అన్నట్లు అతడు 2 లో మహేష్, త్రివిక్రమ్‌లు చేయడానికి ఆసక్తి చూపుతారా లేదా వేచి చూడాలి.