టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవరన నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించరున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌తో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రానుందంటూ నాగ వంశీ తాజాగా వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఆయన చెప్పుకొచ్చాడు.
సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేయాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేసాడంటూ నాగ వంశీ వివరించాడు. ఈ విషయంపై ఆయన రియాక్ట్ అవుతూ.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో మూవీకి ముందు మేము ఒక స్కేల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాం. కానీ.. తాజాగా బాలీవుడ్ నుంచి వచ్చిన రామాయణం గ్లింప్స్ చూశాక.. మా ప్లాన్ పూర్తిగా మారిపోయింది. మా బ్యానర్‌లో మా దర్శకుడు త్రివిక్రమ్ గారు చేస్తున్న మొట్టమొదటి మైథలాజికల్ మూవీ అంటే ఏ లెవెల్ లో ఉండాలి.. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారిని రాముడిగా, కృష్ణుడిగా చూసాం ఇప్పుడు ఎన్టీఆర్ దేవుడిగా కనిపించబోతున్నారు అనే ఆనందం నాతో పాటు అభిమానుల్లోనే ఉంటుంది కదా.. సో రామాయణం గ్లింప్స్ ని ఇండియా అంతా చెప్పుకున్నారు.
ఇప్పుడు మనం చేయబోయే సినిమా అంతకుమించి మాట్లాడుకోవాలని కారణంతో త్రివిక్రమ్ మరికాస్త సమయం అడిగారు. త్వరలోనే అనౌన్స్మెంట్ ఇద్దామని చెప్పడంతో ఆగిపోయమంటూ నాగ వంశీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. వచ్చే ఏడాదికి సెకండ్ హాఫ్ నుంచి ఈ సినిమా ప్రారంభమవుతుందంటూ వివరించాడు. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ వైరల్‌గా మారడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.