సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కాస్టింగ్ కౌచ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కేవలం సినిమా దర్శకులు నిర్మతలే కాదు.. హీరోల పేర్లు కూడా ఈ కాస్టింగ్ కౌచ్‌లో వినిపిస్తూనే ఉంటాయి. అలా.. తాజాగా స్టార్ హీరో పై ఒక అమ్మాయి చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో దుమారంగా మారాయి. డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్‌కు పాల్పడినట్లు ఆ హీరో పై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ.. కేవలం ఆరోపణలు చేయడమే కాదు.. హీరో పేరుని కూడా నిర్భయంగా ట్యాగ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. రమ్య మోహన్ అనే ఓ అమ్మాయి తన సోషల్ మీడియా ఖాతాలో ఈ షాకింగ్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది.
ఈ పోస్ట్‌లో కోలీవుడ్‌లో డ్రగ్స్, కాస్టింగ్ కౌచ్ అనేది నిజంగా ఉందని.. ఇది అసలు జోక్ కాదు.. నాకు తెలిసిన ఓ అమ్మాయిని ఒక హీరో బలవంతంగా లొంగదీసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ నిబంధనల ముసుగులో ఆ హీరో ఇలా ప్రవర్తిస్తున్నాడని.. అంతేకాదు ఆ హీరో క్యారవన్ బేవర్స్ కోసం రూ.2 లక్షలు, డ్రైవ్స్ కోసమే 50,000 ఆఫర్ చేస్తాడని.. ఈ విషయం నేను బయటపెట్టిన ఆ వ్యక్తికి కాస్త కూడా నష్టం లేదు. అతనిని మీడియా దేవుడు లాగే చూపిస్తుంది. కానీ.. ఆ బాధితురాలని మాత్రం పట్టించుకోదు. ఇండస్ట్రీలో డ్రగ్స్, సెక్స్ అనేది నిజంగానే పెద్ద మ్యాటర్. అసలు జోక్ కాదు. ఆ వ్యక్తి బయటికి దేవుడిలా కనిపించినా.. లోపల ఆయన వ్యక్తిత్వం మాత్రం వేరే ఉంది. పైకి మాత్రం మారువేషంలో కనిపిస్తూ ఉంటాడు.
మొదట నేను ఆ అమ్మాయికి సంబంధించిన ఫోన్ చార్ట్ చూసి ఆశ్చర్యపోయా. ఆమెకు సంబంధించిన ఈ విషయం తెలిసి ఫ్యామిలీ షాక్ అయ్యారు. ఇది అసలు స్టోరీ కాదు.. ఆ అమ్మాయి లైఫ్. ఈ విషయం బయట పడ్డాక చాలామంది ఆమెను నిందిస్తారు. కానీ.. ఆ మూర్ఖుడిని మాత్రం గుర్తించరంటూ సెన్సేషనల్ పోస్ట్ షేర్ చేసుకుంది. అంతేకాదు.. ప్రస్తుతం ఆ హీరో వల్ల కాస్టింగ్ కౌచ్ కి గురైన ఆమె.. రిహాబిలైటేషన్ సెంటర్లో ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రమ్య మొహన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతుంది. ఇక ఆ హీరో పేరును చూసిన నేటిజన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా తాను షేర్ చేసిన ఈ పోస్ట్‌ని కొద్ది క్షణాల్లోనే తాను డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే.. రమ్య మోహన్ పోస్ట్ డిలీట్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు ఏదైనా బెదిరింపులు వచ్చి ఉంటాయా.. లేదంటే ఏం జరిగి ఉంటుంది.. ఆమె సడన్గా ఈ పోస్ట్ ను డిలీట్ చేయడానికి కారణాలేంటి అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.