టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకున్న ఈ సినిమా.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందింది, ఆగస్టు 14న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక.. బాలీవుడ్‌లో తారక్‌కు ఇదే మొదటి సినిమా. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి హైప్ ఉంది. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌ను సీతారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ భారీ ధరకు దక్కించుకున్నారు.
తాజాగా.. సినిమాకు సంబంధించిన అదిరి పోయే అప్డేట్స్‌ను ఫాన్స్‌తో షేర్ చేసుకున్నాడు నాగవంశీ కింగ్‌డమ్ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వార్ 2లో ఎన్టీఆర్ ఎంట్రీకి థియేటర్ స్క్రీన్స్ బ్లాస్ట్ అవుతాయి అంటూ నాగవంశీ చెప్పుకొచ్చాడు. దాని గురించి మరింత రివీల్ చేయకూడదని.. ఎన్టీఆర్ ఎంట్రీకి ఆడియన్స్‌లో గూస్ బంప్స్ పక్కా. టైటిల్‌కు తగ్గట్టు హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మధ్య వార్ సీన్స్.. విజువల్ వండర్ గా ఉంటాయంటూ వివరించాడు.
ఇద్దరు బడా స్టార్స్ తలపడుతుంటే, వార్నింగ్ ఇచ్చుకుంటుంటే చూసేందుకు ఎలా ఉంటది అని యాంటిసిపేషన్ మీదే వార్ 2ను కొనుగోలు చేశానంటూ వివరించాడు. నాగ వంశీ కామెంట్స్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ పెరిగింది. మరోవైపు వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌కు నాగ వంశీ ఇప్పటికే భారీ ప్లాన్ చేస్తున్నాడు. ఆగస్టు 14 తెల్లవారుజామున షోస్ ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వార్ 2 తెలుగు స్టేట్స్‌లో మొదటి రోజు భారీ నెంబర్‌లో ఉండబోతుంది.