సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగి.. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న నటినటులు.. తర్వాత ఇతర రంగాల్లోనూ అడుగుపెట్టి.. అక్కడ కూడా మంచి లాభాలు కొల్లగొడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పలు సినిమాలకు నిర్మాతలుగా మారుతారు. మరి కొంతమంది బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇస్తారు. అలా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ సంపాదించి.. థియేటర్ బిజినెస్ రంగంలోనికి అడుగుపెడుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పటికే ఏఎంబి పేరుతో మహేష్ బాబు, ఏఏఏ స్ పేరుతో అల్లు అర్జున్.. హైదరాబాదులో బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ లను ఏర్పాటు చేసి మంచి లాభాలను అర్జిస్తున్నారు.
ఇక టాలీవుడ్ రౌడీ బాయ్.. విజయ్ దేవరకొండ కూడా ఏవిడి స్ పేరుతో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. త్వరలోనే ఈ స్టార్ హీరోల మల్టీప్లెక్స్‌లు ఏపీలోను ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి మాస్ మహారాజ్ రవితేజ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఏషియన్ వారి భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో ఏఆర్‌టా.. ఏషియన్ రవితేజ పేరుతో లగ్జరీ మల్టీప్లెక్స్ నిర్మించారు. మొత్తం ఆరు స్క్రీన్ లతో వనస్థలిపురంలో ఈ థియేటర్ ను సిద్ధం చేశారు. ఇక ఈ థియేటర్ ప్రారంభత్సవం బుధవారం జులై 30న గ్రాండ్గా జరగనుందని సమాచారం.
హీరో రవితేజ తో పాటు పలువురు స్టార్ హీరోలు సినీ ప్రముఖులు సైతం హాజరు కానున్నారట. ఇక ఈ థియేటర్లో మొదట విజయ దేవరకొండ కింగ్డమ్ సినిమాను ప్రదర్శించనున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే.. మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో ప్రారంభిస్తారని వార్తలు వైరల్ అయినా.. నిర్మాణ పనులు కాస్త పెండింగ్ థియేటర్ ఓపెనింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే జులై 31న అన్ని హాంగులతో కింగ్డమ్ సినిమాను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
ఇక ఈ మల్టీప్లెక్స్ మోడరన్ టెక్నాలజీ తో స్మార్ట్ గా నిర్మించినట్లు తెలుస్తుంది. థియేటర్లో వరల్డ్ క్లాస్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయని.. సుమారు 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం, ఫోర్ కే క్వాలిటీ ప్రాజెక్షన్, ఆల్ట్రా క్లియర్ విజువల్స్ అలాగే ఆరు స్క్రీన్ లలో సినిమా ప్రేమికులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే.. టెస్టింగ్ ప్రక్రియను కూడా ఎన్నోసార్లు పూర్తి చేశారట. ఇక థియేటర్‌లో మొదటి రిలీజ్ అవుతున్న సినిమా కింగ్డమ్ కావడంతో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ఆ థియేటర్‌లో చూసేందుకు ఆశక్తి చూపుతున్నారు.