టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నిన్న మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న నాగ్ తాజాగా కుబేర సినిమాతో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోని హీరోగానే కాదు.. ఇంట్రెస్టింగ్ రోల్స్ వస్తే.. కీలక పాత్రలో సైతం నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ అఫీషియల్ గా ప్రకటించాడు. ఇందులో భాగంగానే కూలి సినిమాలో సైతం మెయిన్ విలన్ క్యారెక్టర్ లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. నాటి జనరేషన్ సూపర్ స్టార్స్‌గా పిలవబడే డైరెక్టర్ల అందరితోనూ నాగ్.. కలిసి పనిచేయాలని ఆశపడుతున్నాడట.
ముఖ్యంగా ఆ లిస్టులో డైరెక్టర్ రాజమౌళి పేరు ఉందట. ఇక రాజమౌళి, మహేష్ కాంబోలో ప్రస్తుతం SSMB 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్‌కు ఓ కీలక పాత్ర అనుకున్నారు. అది కూడా మహేష్ తండ్రి రోల్. ఆ క్యారెక్టర్ గురించి నాగార్జున ఒకసారి ట్విట్టర్‌లో మహేష్ తో సంభాషించిన చిట్ చాట్ కూడా వైరల్ గా మారింది. నాగ్ మాట్లాడుతూ.. హాయ్ మహేష్, నేను.. మీ నాన్నగారు కలిసి వారసుడు సినిమాలో అప్పట్లో నటించాం. ఇప్పుడు మనిద్దరం కలిసి అలాంటి సినిమా త్వరలో చేయబోతున్నాం కదా అంటూ రాసుకొచ్చాడు. అప్పుడే అందరికీ SSMB 29 నాగ్ మహేష్ తండ్రి రోల్ లో చేస్తున్నాడని క్లారిటీ వచ్చేసింది.
కానీ ఏమైందో తెలియదు.. కారణమేంటో బయటకు రాలేదు చివరి నిమిషంలో నాగార్జున ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఆ క్యారెక్టర్ కు తాను సెట్ కాననీ నాగ్ అనుకున్నాడో.. లేదా రాజమౌళినే తన విజన్ కు తగ్గ రోల్ లో నాగార్జున పర్ఫెక్ట్ కాదని తప్పించాడో తెలియదు కానీ.. నాగార్జున మాత్రం సినిమాను మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు తండ్రి రోల్ లో తమిళ్ హీరో మాధవన్ నటించిన తెలుస్తుంది. మాధవన్ కంటే ముందు మహేష్ తండ్రి పాత్ర కోసం చియాన్ విక్రమ్ లో సంప్రదించగా.. విక్రమ్ ఎందుకో ఆ క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదట. ఏదేమైనా ఈ సినిమాలో మాధవన్.. మహేష్ తండ్రి రోల్ లో ఎంట్రీ ఇచ్చాడు. అదే నాగార్జున ఉండి ఉంటే మాత్రం సినిమాకు మరో లెవెల్లో బజ్ ఏర్పడేది అనడంలో అతిశయోక్తి లేదు.