టాలీవుడ్ రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాగా జూలై 31న అంటే.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో.. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా మెరవనుంది. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సినిమాకు సంగీతం అందించడం.. సినిమాకు మరింత హైప్‌ను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే.. బిజినెస్ కూడా గ్రాండ్ లెవెల్‌లో జరగనుందని సమాచారం. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా బుకింగ్స్ ఓపెనై రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపట్లోనే.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా.. ఇలా బుక్ మై షో లో కింగ్డమ్ ఒక క్రేజీ రికార్డును క్రాక్ చేసింది.
100 k ప్లస్ టికెట్లు అమ్ముడుపోయినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా వేదికగా సరికొత్త పోస్టర్‌తో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాల్లో విజయ్ స్పై ఏజెంట్‌గా.. భాగ్యశ్రీ పవర్ఫుల్ లేడిగా ఆకట్టుకొనున్నారని సమాచారం. అయ్యప్ప, వెంకటేష్, సత్యదేవ తదితరులు కీలకపాత్రలో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. ఇక.. ఈ సినిమా అంచనాలను అందుకుని బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందా.. లేదా.. ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో వేచి చూడాలి.