టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవిలకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోస్ తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే.. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు సినిమాలు మిస్ అయ్యాయి అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. మహేష్ బాబు ఇప్పటికి తన కెరీర్‌లో ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వాటిలో వెంకటేష్‌తో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ సక్సెస్ అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు.
కాగా.. ఈ ఈ సినిమాను మొదట మహేష్‌తో చిరంజీవి నటించాడు. కానీ.. అనుకోని కారణాలతో ఈ సినిమా వెంకీ చేతికి వెళ్ళింది. అంతేకాదు.. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో మహేష్ కోసం మొదట గెస్ట్ రోల్ క్రియేట్ చేశారట. కానీ ఆ గెస్ట్ రోల్ కి సినిమాలో ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చునే ఉద్దేశంతో దానిని వదిలేశారు. ఇక తర్వాత ఆచార్య సినిమా కోసం చరణ్ చేసిన పాత్రను మొదట మహేష్ చేయాలని కొరటాల శివ భావించాడట. చిరంజీవి కూడా దానికి ఒప్పుకున్నారు. కానీ.. లాస్ట్ మినిట్ లో అది వర్కౌట్ కాలేదు. అంతేకాదు.. వాల్తేరు వేరే సినిమాలో రవితేజ చేసిన క్యారెక్టర్ ను మరింత బెటర్ చేసి మహేష్ బాబుతో చేయించాలని చిరంజీవి భావించాడట.
అది కూడా కాలేదు. అలా మొత్తానికి చిరంజీవి మహేష్ కాంబోలో రావలసిన ఇన్ని సినిమాలు ఎప్పటికప్పుడు క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. మరి వీళ్ళ కాంబినేషన్లో ఎప్పటికైనా ఓ సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం కాయం. వేరే లెవెల్లో సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అంతేకాదు.. సినిమాకు భారీ లెవెల్లో బిజినెస్ కూడా జరుగుతుంది. ఇకనైన వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వచ్చి ఆడియన్స్‌ను మెప్పిస్తుందేమో చూడాలి.