సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో పాటు.. పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఇలా.. అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అద్భుతమైన నటనతో వెండితెరపై ఓ వెలుగు వెలిగి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్‌లు సైతం.. తమ లైఫ్‌లో ఎన్నో చీకటి కోణాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న స్టార్ హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం మురికివాడల్లో జీవనాన్ని కొనసాగిస్తుంది. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో.. ఒకే ఒక ఫ్లాప్ ఆమెను చీకటి కుప్పంలోకి నెట్టేసింది.
ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. పూజ దద్వాల్. తన మొదటి సినిమాతోనే సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసిన పూజ దద్వాల్.. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్ట్రాంగ్‌గా నిలబడింది. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. 17 ఏళ్ల వయసులో.. 1995 లో పూజా.. సల్మాన్ ఖాన్ మూవీ వీర్‌గతి తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దాంతో ఆమె అవకాశాల కోసం ఎంతో కష్టపడింది. తర్వాత.. ఆషికి,ఘరానా ఆమె రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా పూజకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. వివాహం చేసుకొని గోవాలో సెటిల్ అయింది.
కొన్నాళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. 2019లో టీబీ బారిన పడి మొంబైలో ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంది. పూజ దద్వాల్.. కాశీలో మేనేజర్ గా వ్యవహరిస్తూ.. చికిత్స కోసం ముంబై కి వెళ్ళింది. ఆమెకు ఉన్న వ్యాధి తెలిసి ఫ్యామిలీ తనని దూరం పెట్టడంతో.. ఆమె గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ సంవత్సరం పాటు ఆమె చికిత్స, ఆహారం ఖర్చులన్నీటిని చూసుకున్నారు. అలాగే.. నటుడు రవి కిషన్ సైతం ఆమెకు ఎంతగానో అండగా నిలిచాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పూజ.. ఉండేందుకు ఇల్లు లేదు. దీంతో.. ముంబైలోని మురికి వాడలో ప్రస్తుతం లైఫ్ లీడ్ చేస్తుంది. తర్వాత సల్మాన్ ఓ ఇంట్లో అద్దెకు ఉండేందుకు అదె ఖర్చులు భరిస్తున్నారు. ఇప్పటికీ ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.