సినిమాలు లేకున్నా కొంచెం కూడా తరగని ఆస్తులు.. రియల్ హీరో సోనూ సూద్ సంపాదన ఏంటంటే..?

స్టార్ నటుడు సోనుసూద్‌కు సౌత్ ఆడియన్స్ లోనే కాదు.. బాలీవుడ్ లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2020 లో కరోనా మహమ్మారి చుట్టుముట్టి ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న సమయంలో ఈయన ప్రజలకు చేసిన సహాయం.. నిరుపేదలకు ఇచ్చిన అప్ప‌న్న హ‌స్తం ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోతుంది. కరోనా టైంలో లెక్కలేనన్ని మందికి సహాయం అందించినా సోను సూదికు పుట్టిన రోజు కావడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా తన 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సోను సూద్.. నటుడి గానే కాదు, మోడల్ గా, నిర్మాతగా, సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ గా కూడా సత్తా చాటుకున్నాడు. ఇప్పటికి పల్లు సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తున్న వస్తున్నాడు. అయితే.. టాలీవుడ్‌లో మాత్రం ఆయన అతి తక్కువ సినిమాల్లో మాత్రమే మెరుస్తున్నాడు. ముఖ్యంగా.. విలన్ పాత్రలో మంచి పాపులారిటి దక్కించుకున్న సోనూ సూద్‌.. 1999లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన కెరీర్ సౌత్ ఇండస్ట్రీ నుంచే ప్రారంభమైంది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ఎన్నో పాత్రలో నటించిన ఆయన కన్నడలో సుదీప్ తో కలిసిన నటించిన విష్ణువర్ధన్ మూవీ తో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

Sonu Sood And His Wife, Sonali Sood's Love Story Proves Behind Every Great  Man There Is A Woman

ఇక‌ తెలుగులో అరుంధతి సినిమా పశుపతి రోల్‌లో అందరిని భయపెట్టాడు. తాజా సర్వే ప్రకారం సోను మొత్తం ఆస్తులు 140 కోట్ల పైచిలుకే అని తెలుస్తోంది. ప్రతినెలా కోటి రూపాయలకు పైగా సంపాదించే సోనూ.. ఏడాదికి 12 కోట్లు కూడ‌బెడ‌తాడు. కేవలం సినిమాల నుంచి కాదు ప్రకటనలు, సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా సంపాదిస్తూ కోట్లు సంపాదించే సోనూసూద్.. బిజినెస్ పరంగాను రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ముంబైలో లగ్జరీ హౌస్ కూడా ఉంది. ఇక ఫోర్ బెడ్ రూమ్ కలిగి ఉన్న ఈ హౌస్‌తో పాటు.. ముంబైలో జూహులో సొంత హోటల్ కూడా రన్ చేస్తున్నారు. దీని ద్వారా.. మంచి ఆదాయాన్ని కూడపెడుతున్నారు. అంతేకాదు.. ఎన్నో లగ్జరీ కార్లు కూడా సోను సొంతం. ఇక ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా నటించకుండా సేవా కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటూ.. బిజినెస్ రంగంలో రాణిస్తూ.. ఆస్తులను పెంచుకుంటూనే ఉన్నాడు.