ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్.. వార్ 2 ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెర‌కెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ వార్ 2.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. జూలై 25న గ్రాండ్ లెవెల్‌లో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేక‌ర్స్‌ తాజాగా ప్రకటించారు. అయితే.. జులై 25న ట్రైలర్ రిలీజ్ చేయడానికి గల కారణాన్ని కూడా మేకర్స్‌ వివరించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. ఇద్దరు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాజాగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భాన్ని ఇద్దరికీ కలిపి ఒకేసారి సెలెబ్రేట్ చేస్తూ.. య‌ష్ రాజ్ ఫిలింస్‌.. వార్ 2 ట్రైలర్ జూలై 25న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

2019లో బ్లాక్‌బ‌స్టర్ సక్సెస్ అందుకున్న వార్ కు సీక్వెల్‌గా వార్ 2 రూపొందుతుంది. ఆయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో తెర‌కెక్కనున్న ఈ సినిమాలో హృతిక్‌.. క‌బీర్ పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ మరో పవర్ఫుల్ రోల్‌లో మెర‌వ‌నున్నాడు. ఇందులో బాలీవుడ్ నటి కియారా అధ్వని హీరోయిన్గా కనిపించనుంది. ఏక్ థా టైగర్, వార్‌ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన య‌ష్ రాజ్‌ ఫిలింస్‌ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్‌ చేసుకుంటూ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న‌ సంగతి తెలిసిందే.

Hrithik Roshan and NTR Jr to separately promote 'War 2'

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడలో తీసుకురారన్నారు మేకర్స్. ఇక తారక్‌కు ఇది బాలీవుడ్ డబ్బింగ్ మూవీ కావ‌డంతో.. తెలుగు మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీ జర్‌తో హృతిక్, ఎన్టీఆర్ హై అండ్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్‌లో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై పోటాపోటీ యాక్షన్ తో చూడాలని ఆరాటపడుతున్నారు. ఇక‌ ఈ ఇద్దరు స్టార్ హీరోల 25 ఏళ్ల జ‌ర్నీని సెల‌బ్రేట్ చేస్తూ రిలీజ్ చేయ‌నున్న‌ ట్రైలర్ అభిమానులకు డబల్ ట్రీట్ అవుతుందనడంలో సందేహం లేదు.